India Iran : రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది .. భారత్ నౌకల విషయం లో ఇరాన్ సంచలన నిర్ణయం

 Authored By siddhu | The Telugu News | Updated on :24 March 2026,8:00 pm

ప్రధానాంశాలు:

  •  India Iran : రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది .. భారత్ నౌకల విషయం లో ఇరాన్ సంచలన నిర్ణయం

India Iran  : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధ గొడవలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గం మూసుకుపోతుందో, ఎక్కడ బాంబులు పడతాయో తెలియని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో మన దేశం తన తెలివితేటలతో ఒక అద్భుతమైన పని చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాణవాయువు లాంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ సైన్యం మూసేయడంతో మనకు రావాల్సిన 22 భారీ నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. ఇరాన్ అక్కడ సముద్రంలో మందుపాతరలు వేయడం వల్ల ఆ రూటులో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. అయితే ఇండియా ఇరాన్ తో మాట్లాడి రాత్రికి రాత్రే ఒక కొత్త దౌత్య వ్యూహాన్ని అమలు చేసింది. ఆ చిక్కుకుపోయిన నౌకల కోసం ఇరాన్ స్వయంగా ఒక ప్రత్యేకమైన కారిడార్ ఏర్పాటు చేసి మన సరుకును సురక్షితంగా పంపిస్తోంది.

India Iran : రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది .. భారత్ నౌకల విషయం లో ఇరాన్ సంచలన నిర్ణయం

India Iran : రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది .. భారత్ నౌకల విషయం లో ఇరాన్ సంచలన నిర్ణయం

India Iran  : సామాన్యుడి వంటగదిపై యుద్ధ ప్రభావం

ఈ నౌకల్లో కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే లేవు. మనకు ప్రతిరోజూ అవసరమయ్యే వంట గ్యాస్, పప్పులు, పండ్లు మరియు పాల ఉత్పత్తులు టన్నుల కొద్దీ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం ఏటా భారీగా దిగుమతి చేసుకునే ఇంగువ సరఫరా ఈ గొడవల వల్ల ఆగిపోయింది. దీనితో మన ఊర్లలో ఇంగువ రేటు ఇప్పటికే 15 శాతం పెరిగింది. అలాగే బాదం, పిస్తా, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ కూడా దుబాయ్ మీదుగా ఇదే రూటులో రావాలి కాబట్టి వాటి ధరలు కూడా రాబోయే రోజుల్లో 50 శాతం పెరిగేలా ఉన్నాయి. ఒకవేళ ఈ నౌకలు రావడం ఆలస్యమైతే సామాన్యుడి బడ్జెట్ తలకిందులు కావడం ఖాయం. అయితే ప్రభుత్వం వేరే దేశాల నుంచి సరుకు తెప్పించేందుకు కొత్త దారి వెతుకుతోంది.

ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక వైపు చేరి యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంటే ఇండియా మాత్రం ఎవరి పక్షం వహించకుండా తన దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పింది. అమెరికా లాంటి పెద్ద దేశాలు ఇరాన్ పై ఆంక్షలు పెడుతున్నా మన దేశం మాత్రం తన దౌత్యంతో చిక్కుకున్న నౌకలను బయటకు తెచ్చుకోగలిగింది. ఒకవేళ పరిస్థితులు ఇంకా దారుణంగా మారితే ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి సరుకు రప్పించేలా ఒప్పందాలు కూడా చేసుకుంటోంది. అవసరమైతే ఏ దేశ హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ నుంచి నేరుగా చమురు కొనే స్థాయికి మన దేశం చేరుకుంది. ఇలాంటి కష్టకాలంలో కూడా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు ఇండియాను ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా నిలబెడుతున్నాయి. మన అవసరాలను తీర్చుకుంటూనే శాంతిని కాపాడటం మన దేశ ప్రత్యేకత.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి