Lok Sabha Exit Polls Results : లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల.. ఆ పార్టీకి తిరుగే లేదు..!
Lok Sabha Exit Polls Results : దేశ మంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వేవ్ ఈ సారి ఉంటుందా ఉండదా అనేది అందరిలోనూ అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్నికల కౌంటింగ్ ఫలితాల కంటే మూడు రోజుల ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తాజాగా శనివారం సాయంత్రం వచ్చేశాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం.
Lok Sabha Exit Polls Results NDTV సర్వే..
ప్రముఖ ఎన్డీటీవీ సర్వే ఎన్డీయే కూటమిదే అధికారం అని తేల్చేసింది. ఈ సారి కూడా ఎన్డీయే కూటమికి భారీగా సీట్లు వస్తున్నట్టు చెప్పింది ఈ సర్వే. ఎన్డీయే కూటమికి 365 సీట్లు వస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇండియా కూటమి 142, ఇతరులు 36 సీట్లు సాధిస్తారని స్పష్టం చేసింది.
Lok Sabha Exit Polls Results న్యూస్ నేషన్..
న్యూస్ నేషన్ సర్వేలో కూడా ఎన్టీయే కూటమిదే అధికారం అని తేలింది. ఎన్డీఏకు 342 నుంచి 378 వరకు సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. ఇండియా కూటమికి కేవలం 153 నుంచి 169 సీట్లు మాత్రమే వస్తున్నట్టు తేల్చింది ఈ సర్వే.
Lok Sabha Exit Polls Results రిపబ్లిక్ టీవీ
రిపబ్లిక్ టీవీ కూటీ ఇండియా కూటమికే జై కొట్టింది. ఎన్డీయేకు 353 నుంచి 368 సీట్లు రాబోతున్నట్టు తెలిపింది. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఇండియా కూటమికి మాత్రం 118 నుంచి 133 సీట్లు వస్తున్నట్టు తేల్చింది. ఇతరులు 43 – 48 సీట్లు సాధిస్తారని తెలిపింది.
Lok Sabha Exit Polls Results జన్ కీ బాత్ సర్వే..
జన్ కీ బాత్ సర్వేలో ఇండియా కూటమికి భారీగా సీట్లు వస్తున్నాయి. ఎన్డీయేకు 362 నుంచి 392 సీట్లు వస్తున్నాయి. ఇండి కూటమికి 141 నుంచి 161 సీట్లు రాబోతున్నాయి. ఇతరులు 10 నుంచి 20 సీట్లు గెలుచుకుంటున్నారు.
Lok Sabha Exit Polls Results మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్..
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లోనూ ఇండిఎన్డీయే కూటమిదే అధికారం అని తేలిపోయింది. ఎన్డీయే కూటమికి ఏకంగా 353 నుంచి 368 సీట్లు వస్తున్నాయి. ఇక ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు వస్తున్నాయి. ఇతరులు 43 నుంచి 48 సీట్లు సాధిస్తారు.