Exit Polls Results : ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఏ పార్టీ గెలవబోతోందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Exit Polls Results : ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఏ పార్టీ గెలవబోతోందంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :1 June 2024,7:40 pm

Exit Polls Results : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కౌంటింగ్ ఫలితాలకు ఇంకో మూడు రోజుల సమయం ఉన్నా సరే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ సారి తాజాగా జూన్ 1న సాయంత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ సారి ఏపీ ఫలితాలపైనే అంరి దృష్టి ఉంది. ఎందుకంటే టఫ్ ఫైట్ జరిగింది కాబట్టి ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఇందలో ఏ పార్టీకి ఏ సంస్థ ఎన్ని సీట్లు ఇచ్చిందో చూద్దాం.

Exit Polls Results ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ( ఏపీ లోక్ సభ)

ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి కేవలం 4 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక అటు టీడీపీ కూటమికి మాత్రం 21 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పింది.

Exit Polls Results సీఎన్ఎన్ న్యూస్ -18 (లోక్ సభ)

ఈ సంస్థ కూడా టీడీపీ కూటమికే ఎక్కువ సీట్లు కేటాయించింది. ఈ సారి టీడీపీ కూటమికి 19 నుంచి 22 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. అటు వైసీపీకి మాత్రం 5 నుంచి 8 సీట్లు వస్తున్నట్టు చెప్పింది.

Exit Polls Results ఆరా ఎగ్జిట్ పోల్స్

ఈ సంస్థ సర్వేలో వైసీపీ ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పింది. వైసీపీకి ఏకంగా 94 నుంచి 104 సీట్లు వస్తున్నట్టు తెలిపింది. కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఎంపీ సీట్లలో కూడా వైసీపీకి 13 నుంచి 15 సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు వస్తున్నట్టు తెలిపింది.

Exit Polls Results భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్

ఈ సంస్థ సర్వేలో వైసీపీకి 112 నుంచి 143 సీట్లు వస్తున్నట్టు తెలిపింది. టీడీపీ కూటమికి మాత్రం 32 నుంచి 63 సీట్లు వస్తున్నట్టు తెలిపింది.

Exit Polls Results ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌ ఏ పార్టీ గెలవబోతోందంటే

Exit Polls Results : ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఏ పార్టీ గెలవబోతోందంటే..?

Exit Polls Results పీపుల్ పల్స్

ఈ సర్వేలో కూడా టీడీపీ కూటమికే అధికారం దక్కుతుందని తెలిపింది. టీడీపీకి 95 -110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీకి 02 నుంచి 05 సీట్లు వస్తున్నట్టు తెలిపింది. వైసీపీకి 45 నుంచి 60 సీట్లు రాబోతున్నట్టు స్పష్టం చేసింది.

పార్థ ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్సార్‌సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తుందని చెప్పింది. టీడీపీ కూటమికి 55 నుంచి 65 సీట్లు రాబోతున్నట్టు స్పష్టం చేసింది.

టీవీ 9 పోల్ స్ట్రాట్ ఎంపీ స్థానాలు

వైఎస్సార్‌సీపీ కి 13 సీట్లు వస్తాయని టీవీ9 సర్వేలో తెలిపింది. టీడీపీ కూటమి 12 సీట్లు రాబోతున్నట్టు చెప్పింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది