Crime News : వ్యక్తిపై దాడి చేసి చేయి నరికారు.. దాన్ని తీసుకొని ఏం చేశారో తెలిస్తే దారుణం అంటారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crime News : వ్యక్తిపై దాడి చేసి చేయి నరికారు.. దాన్ని తీసుకొని ఏం చేశారో తెలిస్తే దారుణం అంటారు

 Authored By kranthi | The Telugu News | Updated on :11 January 2023,8:30 am

Crime News : పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా.. క్రైమ్ పై కన్నేసినా.. నేరాలు మాత్రం ఆగడం లేదు. రకరకాలుగా నేరాలు పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తి చేయినే నరికేశారు దుండగులు. అసలు.. అతడిపై ఎందుకు దాడి చేశారో.. ఎందుకు చేయి నరికారో.. అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది.

man hand chopped off in haryana

man hand chopped off in haryana

జుగ్న అనే వ్యక్తిది కురుక్షేత్ర. ఇటీవల కురుక్షేత్రలో ఉన్న హవేలిలో కూర్చొన్నాడు జుగ్ను. ఇంతలో అక్కడికి ఓ 10 మంది వచ్చారు. ముసుగులు వేసుకున్నారు. ఉన్నపళంగా జుగ్నుపై దాడి చేయడం మొదలు పెట్టారు. కత్తితో దాడి చేసి అతడి చేయిని నరికేశారు. ఆ తర్వాత ఆ చేయిని తమతో పాటే తీసుకెళ్లారు. ఒక్క క్షణంలో అక్కడి పరిస్థితి మొత్తం మారిపోయింది. అతడి చేయిని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు.

Crime News : బాధితుడి చేయిని ఎందుకు తీసుకెళ్లారు అనేది అంతుచిక్కడం లేదు

అయితే.. ఒక వ్యక్తిపై దాడి చేసి ఎందుకు అతడి చేయిని నరికి.. తీసుకెళ్లారు అనేది అంతుచిక్కడం లేదు. అయితే.. ఆ బాధితుడికి తీవ్ర రక్త స్రావం కావడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి చేయిని ఎందుకు నరికి తీసుకెళ్లారు అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది