Modi : మోడీ ప్రభుత్వం మరో అదిరిపోయే పథకం.. పేదలకు నెలకు రూ.3000 పెన్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : మోడీ ప్రభుత్వం మరో అదిరిపోయే పథకం.. పేదలకు నెలకు రూ.3000 పెన్షన్

 Authored By himanshi | The Telugu News | Updated on :13 March 2021,5:45 pm

Modi : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వృద్దులకు పెన్షన్‌ ను ఇస్తున్న విషయం తెల్సిందే. ఆ పెన్షన్ ను మరింతగా పెంచేందుకు గాను మోడీ ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టింది.  నెల వారి ఆదాయం 15 వేల కంటే తక్కువ ఉన్న వారిని గుర్తించి వారి ఖాతాల నుండి నెలకు రూ.50 నుండి రూ.200 వరకు కట్‌ చేసుకుని 60 ఏళ్లు దాటి తర్వాత వారికి రూ.3000 పెన్షన్‌ ఇచ్చే పథకంను ప్రవేశ పెట్టింది. 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల వారికి మాత్రమే ఈ పథకంలో ఇప్పుడు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భరోసా కలిగించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం నిజంగా చాలా బాగుందని విశ్లేషకులు అంటున్నారు.

Modi Pradhan Mantri Shram Yogi Mandhan pension scheme Launched

Modi Pradhan Mantri Shram Yogi Mandhan pension scheme Launched

Modi : ప్రీమియంను బట్టి పెన్షన్‌…

అసంఘటిత కార్మికుల నుండి నెల వారిగా ఎంత ప్రీమియం అయితే కట్‌ చేస్తారో అంతే మొత్తంలో వారి భవిష్యత్తు పెన్షన్‌ ఉంటుంది. తక్కువ మొత్తంను ప్రీమియంగా చెల్లించిన వారికి తక్కువ పెన్షన్‌ ను ఎక్కువ మొత్తంలో ప్రీమియం కట్టింగ్ పెట్టుకున్న వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్‌ ను ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మొత్తం పథకంకు కేంద్రం నుండి కూ డా భారీ ఎత్తున నిధులు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నారు.

Modi : పేద వృధ్దులకు ఆర్థిక భరోసా..

వృద్దులు అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరిపై ఆధార పడే అవసరం లేకుండా మోడీ తీసుకు వచ్చిన ఈ పథకం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షన్‌ లు సరిపోవడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంను ఆలోచించి ఈ నిర్ణయంను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం భవిష్యత్తులో చాలా ఉపయోగదాయకం అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది