SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త… 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త… 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త... 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు...!

SBI Good News : తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI ) ప్రతి పౌరుడు కి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే దిశగా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పీఎం సూర్య ఘర్ యోజన ప్రయోజనాలను లబ్ధిదారులకు అందిస్తోంది. ఎస్బిఐ యొక్క రుణ సౌకర్యాల ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

SBI Good News : పీఎం సూర్య ఘర్ యోజన పథకం…

ఎస్బిఐ ఖాతాదారులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలంటే మీ ఇంటి పై కప్పు పై సోలార్ రూఫ్ ఫ్యానల్స్ ను ఇన్ స్టాల్ చేసేందుకు తగినంత స్థలాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు ఈ ప్యానెల్స్ ను వారి ఇంటి పై ఇన్ స్టాల్ చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది.

SBI Good News సోలార్ ఇన్స్టాలేషన్ సబ్సిడీ…

ఈ పథకం ద్వారా ప్రభుత్వం కనీస సబ్సిడీని సోలార్ రూఫ్ ప్యానెల్ సిస్టమ్ యొక్క కిలోవాట్ సామర్థ్యం ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా 30 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.

SBI Good News : ఎస్బిఐ నుండి రుణ సౌకర్యం…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఎస్బిఐ వినియోగదారులు తక్కువ వడ్డీ రేటు రుణ సౌకర్యాలను అందుకుంటారు. ఇక ఈ రుణాలను పొందడం ద్వారా ప్రజలు ఖాళీగా ఉన్న ఇంటిపై సౌర పలకలను అమర్చుకోవచ్చు. ఈ విధంగా ఉచిత విద్యుత్తును పొందవచ్చు.

SBI Good News ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు

SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త… 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు…!

SBI Good News రుణ అర్హత…

3 KW నుండి 10 KW సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం ఎస్బిఐ 10.15 % వార్షిక వడ్డీ రేటు తో 6 లక్షల వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది.

60 నుండి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు సీనియర్ సిటిజెన్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఎస్బిఐ అందిస్తున్న ఈ ప్రయోజనాల పొందవచ్చు.

ఎస్బిఐ అందిస్తున్న రుణ సదుపాయం ద్వారా వ్యక్తులు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ఆ తర్వాత పీఎం సూర్య ఘర్ యోజన కింద ఉచిత విద్యుత్తును కూడా పొందవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది