Chandrayan – 3 : చంద్రయాన్ – 3 మిషన్ ప్రోగ్రాం రాసింది మన తెలుగు కుర్రాడే ..!!
Chandrayan – 3 : చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది భారతదేశం. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన ల్యాండర్ ఆగస్టు 23.2023న జరిగింది. సాయంత్రం 6:04 లకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. అయితే ఈ మిషన్లో జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ మిషన్ లో టూ పిలౌట్స్ ఉన్నాయి. అంటే LHBC , ILSA ఉన్నాయి. వీటికి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రాశారు కృష్ణ. ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి మద్దిలేటి సంతానమే ఈ కృష్ణ కుమార్. 2008లో పదవ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు తిరుపతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ఈసెట్ రాసి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ లో చేరారు.
సిఎస్సిలో చేరారు. కాలేజీలో DRDO లో మూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఇస్రో లో సంబంధించిన పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించారు. తరువాత చంద్రయాన్ 3 మిషన్ కి మూడు నెలల పాటు పనిచేశారు. చంద్రయాన్ లో అనేక కేంద్రాలు పనిచేసాయి. మిషన్ టు పిలౌట్స్ లో ఐదు మంది సభ్యులు పనిచేసిన వీటిలో ఐఎల్ బిసి, హెచ్ఎస్ బిసి కి డేటా ఎనాలసిస్ సాఫ్ట్వేర్ రాశారు. ఎల్ హెచ్ బిసి అంటే హారిజంటల్ వెలాసిటీ అలాగే ఐఎల్ఎస్ఏ అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలను గుర్తించి రికార్డ్ చేస్తుందని గుర్తించారు కృష్ణ. ఈ సాఫ్ట్వేర్ పిల్లౌట్స్ నుంచి వచ్చే డేటాను ISRDC బెంగుళూరు అందుకుంటుంది. కృష్ణ మల్టీ టాలెంటెడ్ కూడా.
లేబరేటరీ ఎలక్ట్రానిక్స్ టాపిక్ సిస్టం బెంగళూరులో తోటి సైంటిస్టులతో ఆడే క్యారమ్స్ లో రెండేళ్లు వరుసగా ఛాంపియన్గా నిలిచారు. ఆ తర్వాత తిరువనంతపురంలో జరిగిన నేషనల్ కార్పొరేషన్స్ ఆఫ్ ఏరో బిలిటి కార్యక్రమంలో నేషనల్ మెంబర్గా పాల్గొన్నారు. అయితే తనకు ఐదేళ్ల వయసులోని పోలియో సోకిందట. అయితే ఓ ఆయుర్వేద వైద్యుడు మెరుగైన వైద్యం అందించారట. 23 ఏళ్ల పాటు ఆయుర్వేద వైద్యంను అందుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇచ్చారని తాత స్ఫూర్తితో రాణిస్తున్నానని కృష్ణ మీడియాతో తన వ్యక్తిగత విషయాలను, అనుభవాలను తెలియజేశారు ఇప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచారు. జై భారత్ – జై చంద్రయాన్ .