Today Last day : నేడే లాస్ట్ డేట్… అప్ డేట్ చేస్తేనే అకౌంట్ లలో డబ్బులు..!!
దేశవ్యాప్తంగా రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రయోజనాలు చేకూర్చే రీతిలో ప్రోత్సాహం కల్పించే విధంగా పలు పథకాలు అమలు చేస్తూ వుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన పథకం కింద ప్రతి ఏడాది ₹6000 రూపాయలు అందించనుంది.ఈ డబ్బులను మూడు విడుతలలో ₹2000 చొప్పున పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు.
ఈ క్రమంలో రైతులకు ఇస్తున్న పీఎం కిసాన్ సమాన్ నిధి 13వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారో వారి అకౌంట్ లో డబ్బులు పడనున్నాయి. అయితే eKYC పూర్తి చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్. eKYC పూర్తి చేయని వారు బయోమెట్రిక్ ఆధారిత eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన వారికి 13వ విడత ₹2000 రూపాయల చొప్పున సాయం అందించనుంది కేంద్రం. గతంలోనే హోలీకి ముందు రైతుల ఖాతాలో డబ్బులు చెల్లించనున్నట్లు వాళ్ళని సంతోషపెట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈకేవైసీ చేయని వారి ఖాతాలకు డబ్బులు బదిలీ చేయట్లేదని పేర్కొనడం జరిగింది. దీంతో ఈకేవైసీ… పూర్తి చేయటానికి ఈ రోజే ఆఖరి తేదీ కావటంతో రైతులు త్వరగా పూర్తిచేయాలని కేంద్రం కోరుతూ ఉంది.