Viral News : మా కుతురికి ప్రేతాత్మ వ‌రుడు కావ‌లెను.. త‌ల్లిదండ్రుల వింత ప్ర‌క‌ట‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : మా కుతురికి ప్రేతాత్మ వ‌రుడు కావ‌లెను.. త‌ల్లిదండ్రుల వింత ప్ర‌క‌ట‌న‌

 Authored By ramu | The Telugu News | Updated on :14 May 2024,2:25 pm

ప్రధానాంశాలు:

  •  Viral News : మా కుతురికి ప్రేతాత్మ వ‌రుడు కావ‌లెను.. త‌ల్లిదండ్రుల వింత ప్ర‌క‌ట‌న‌

Viral News  : బ‌తికున్న వారికి ఇటీవ‌ల పెళ్లిళ్లు కావ‌డం ఇబ్బందిగా ఉంది. అలాంటి ఒక ఊరిలో చ‌నిపోయిన వారికి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎప్పుడో చనిపోయిన కూతుర్లకు పెళ్లి చేయ‌గం కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చారు. తాజాగా ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురికి వరుడు కావాలంటూ ప్రకటన ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కర్ణాటకలోని తుళునాడులో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చనిపోయిన తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. తుళు మాసం వచ్చిందంటే ప్రత్యేకించి మరీ ఈ వివాహాలు జరిపిస్తారు.

Viral News  : చ‌నిపోయిన వారికి పెళ్లా..!

30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఈ ప్రకటనలో కోరారు. “కులల్‌ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 ఏండ్ల క్రితం మరణించింది. ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించిన, 30 సంవత్సరాల క్రితం మరణించిన వరుడు ఉన్నట్లయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించండి” అని ఈ ప్రకటనలో తెలిపారు. 30 ఏళ్ల క్రితం చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ప్రేతాత్మ పెళ్లి చేయడానికి ఇష్టమైతే సంప్రదించండి’ అంటూ ఫోన్ నంబర్ తో ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

Viral News మా కుతురికి ప్రేతాత్మ వ‌రుడు కావ‌లెను త‌ల్లిదండ్రుల వింత ప్ర‌క‌ట‌న‌

Viral News : మా కుతురికి ప్రేతాత్మ వ‌రుడు కావ‌లెను.. త‌ల్లిదండ్రుల వింత ప్ర‌క‌ట‌న‌

అయితే ఈ ప్రకటన వైరల్ అవ్వడంతో 50 మంది స్పందించారని ప్రకటన ఇచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ఈ ప్రేతాత్మ వివాహా తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు. ఈ పెళ్లిని బతికున్న వారికి ఎలా చేస్తారో అలానే చేస్తారు. వధువు, వరుడి బొమ్మలను పీటల మీద కూర్చోబెట్టి.. వాటికి పెళ్లి బట్టలు ధరిస్తారు. గ్రాండ్ గా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపిస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ఇలా చేస్తారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చనిపోయిన బాధలోంచి బయటకు వచ్చి సంతోషంగా గడపడం కోసం ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. తుళులో ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుండ‌డం విశేషం.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది