Today Gold Rates : ఆగస్ట్ నెలలో మహిళలకు మంచి శుభవార్త. ఇటీవల కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. దీంతో అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద బంగారం నిల్వలు పెరిగాయి. 2021 క్యూ2లో బంగారం ధర 705 టన్నులుగా ఉండేవి. 2022 క్యూ2కు వచ్చేసరికి ఇవి 768 టన్నులకు చేరాయి. భారత్ గత కొన్నేళ్లలో బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అయితే దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి.. రూ. 47,100కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 47,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 51,380కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,490గా ఉండేది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,380గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,300గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,130గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,410గాను ఉంది.కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 51,380గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే.. 100 గ్రాముల వెండి రూ. 40 తగ్గి.. 5,800గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 దిగొచ్చి.. రూ. 58,000కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 58,400గా ఉండేది. ఇక దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లను ప్రభావితం చేసే అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధర ఈరోజు పైకి చేరింది. వెండి మాత్రం పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.45 శాతం పెరుగుదలతో 1795 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.02 శాతం తగ్గింది. 20.36 డాలర్లకు దిగి వచ్చింది.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.