Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఆగస్ట్‌లో బంగారం, వెండి ధరలు కాస్త శాంతించిన సెప్టెంబర్‌లో మాత్రం క్రమక్రమేపి పెరుగుతూ పోతున్నాయి. దీంతో మహిళలు ఉలిక్కిపడుతున్నారు. నవరాత్రుల సందర్భంగా మహిళలు బంగారం వేసుకొని ధగ ధగ మెరిసిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో భారీగానే బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని ఇలా బంగారం, వెండి పెరుగుతూ పోతుండడం వారిని కలవరపరుస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ. 270 పెరగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,270గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,650 వద్ద కొనసాగుతోంది. వెండిపై రూ. 200 పెరిగి, హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.58,200గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47,000గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,270గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 58,200 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270గా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,220గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510గా ఉంది.
Today Gold Rates : భగభగమంటున్న బంగారం..
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,800గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050 వద్ద కొనసాగుతోంది.బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,940 వద్ద ఉంది. కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,890గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,650 వద్ద కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా ప్రభావం చూపుతోంది.