TRS : టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 11 మంది ఎమ్మెల్యేలు జంప్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 11 మంది ఎమ్మెల్యేలు జంప్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 March 2021,10:12 am

TRS : తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలి.. ఇదే ప్రస్తుతం బీజేపీ పార్టీ లక్ష్యం. దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతోంది బీజేపీ పార్టీ. ఇక్కడ నుంచి కాదు.. ఏకంగా కేంద్రం నుంచే డైరెక్షన్ నడుస్తోంది. అక్కడ హైకమాండ్ కూర్చొని.. తెలంగాణ రాజకీయాలను ఎటు కావాలంటే అటు మార్చేస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

11 trs mlas to join in bjp party soon

11 trs mlas to join in bjp party soon

నిజానికి తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈనేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణను టార్గెట్ చేశారు. తన ఒంటి చేత్తో తెలంగాణ రాజకీయాలను గిర్రును తిప్పుతున్నారు.

TRS : అమిత్ షా ఆపరేషన్ ఆకర్ష్

అయితే.. అమిత్ షా తాజాగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారట. దానిలో భాగంగా.. త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో పాటుగా.. ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక మాజీ మంత్రి, ఒక జెడ్పీ చైర్మన్ కూడా బీజేపీలో చేరనున్నారట. వాళ్లతో సంపద్రింపులు కూడా అయ్యాయట. త్వరలోనే వీళ్లంతా కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారట.

11 మంది ఎమ్మెల్యేలలో.. వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు, నిజామాబాద్ కు చెందిన ఇద్దరు, మహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బీజేపీతో టచ్ లో ఉన్నారట. బీజేపీ నేతలతో భేటీలు కూడా అయిపోయి.. పార్టీలో చేరడానికి మంచి తరుణం కోసం వెయిట్ చేస్తున్నారట.

మరో ఇద్దరు ఎమ్మెల్సీలు.. త్వరలో తమ పదవీకాలం ముగియబోతున్నందున.. పార్టీ నుంచి వాళ్లకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో… పార్టీని వీడాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారట.

అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాగైతే టీఆర్ఎస్ పార్టీలో చేరారో.. వాళ్ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఏ ఫార్ములా అయితే ఉపయోగించిందో.. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తోందట. అయితే.. తమ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పార్టీని వీడుతున్నట్టు సీఎం కేసీఆర్ కు కూడా సమాచారం అందిందట. దానిపై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది