Sri Maha Vishnu : ఎవరికీ తెలియని 14 విష్ణు అవతారాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Maha Vishnu : ఎవరికీ తెలియని 14 విష్ణు అవతారాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Sri Maha Vishnu : ఎవరికీ తెలియని 14 విష్ణు అవతారాలు...!

Sri Maha Vishnu : ఈ భూమి మీద అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని ఇన్నేళ్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వీటిలో మనకు తెలిసింది దశావతారాలు 10 మాత్రమే. ఈ దశావతారాల్లో ఒక అవతారం ఈ కలియుగంలోనే పుట్టాల్సి ఉంది. ఇకపోతే ఈ దశావతారాలలో చేర్చబడని మిగిలిపోయిన ఆ 14 ప్రసిద్ధ అవతారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Sri Maha Vishnu : 1.హైగ్రీవ.

హిందూమతంలో హైగ్రీవ స్వామి ని విష్ణు యొక్క మరో అవతారంగా భావిస్తారు.

Sri Maha Vishnu : 2.వేద వ్యాసుడు.

వ్యాసుడు ద్వాపర యుగంలో జన్మించినటువంటి అమర ఋషి. ఆయన హిందూ పురాణాలలోని నాలుగు వేదాలను విభజించడం వలన అతనికి వేదవాసుడు అనే పేరు వచ్చింది.

Sri Maha Vishnu : 3. మహీదాస అయితరయ్య

హిందూ శాస్త్ర ప్రకారం మహిదాస ఒక ఋషి కుమారుడు. ఈయన ఐతరయ్య అనే ఒక బ్రాహ్మణాన్ని రచించాడు.

Sri Maha Vishnu : 4.యజ్ఞం.

శ్రీమహావిష్ణువు యజ్ఞం అని పిలవబడే మరో అవతారాన్ని కూడా తీసుకుంటాడు.
యజ్ఞానికి యాగం అనే మరో పేరు కూడా ఉంది.

Sri Maha Vishnu : 6. ధన్వంతరి.

దేవతలను రక్షించడానికి శ్రీమహావిష్ణు ధన్వంతరి అనే అవతారాన్ని కూడా ఎత్తాడు.

7.మోహిని.

దేవతలకు దైవిక అమృతాన్ని అందించడానికి విష్ణువు ఎత్తిన మరో రూపమే మోహిని అవతారం.మోహిని అనే పేరు మోహ అనే క్రియా రూపం నుంచి వచ్చింది.

8.దత్తాత్రేయ.

దత్తాత్రేయ అవతారం విష్ణు
యొక్క మరొక అవతారం ఈయననే త్రిమూర్తి యొక్క అంశగా కూడా భావిస్తారు.

9.సనత్ కుమార్లు.

హిందూమతంలో బ్రహ్మ మానస కుమారుల్లో సనత్ కుమార్లు కూడా ఒకరు.

10. రీశాబా అవతార్.

దైవిక జ్ఞానాన్ని వ్యాపింపచేయడానికి విష్ణువు రిషబ్ అవతారాన్ని తీసుకున్నాడు. భాగవతంలో విష్ణు 24 అవతారాల్లో లార్డ్ రిషబ్ అవతారం కూడా ఒకటి.

11. హంస.

విష్ణువు వేదాలను బోధించడానికి హంస పక్షి అవతారాన్ని తీసుకుంటాడు.
సనాతన ధర్మంలో లింగార్క సాంప్రదాయానికి మొదటి గురువు శ్రీ హంసభగవానుడు.

12.నరా నారాయణలు.

శ్రీమహావిష్ణువు నరా నారాయణలు అనే ఇద్దరు ,కవలల అవతారం ఎత్తుతాడు. విష్ణు యొక్క ఈ అవతారం భూమి మీద
ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చింది.

Sri Maha Vishnu ఎవరికీ తెలియని 14 విష్ణు అవతారాలు

Sri Maha Vishnu : ఎవరికీ తెలియని 14 విష్ణు అవతారాలు…!

13. తాపస.

హిందూ పురాణాల్లో తాపస అనేది నాలుగో మనువు అని పేరు. తాపసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి దిగి వస్తాడు. అందుకే విష్ణు యొక్క ఈ అవతారానికి తాపస అవతారం అనే పేరు పెట్టబడింది.

14.ఆది పురుషుడు.

ఆది పురుషుడు విష్ణువు యొక్క మొదటి అవతారం అంతేకాదు ఈ విశ్వంలో మొదటి వ్యక్తిగా పరిగణించబడ్డారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది