Today Corona Updates : భారత్ లో కోరలు చాస్తోన్న కరోనా.. ఒక్కరోజే 1,94,720 కేసులు..442మరణాలు.! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Corona Updates : భారత్ లో కోరలు చాస్తోన్న కరోనా.. ఒక్కరోజే 1,94,720 కేసులు..442మరణాలు.!

Today Corona Updates : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 1 లక్షా 94 వేల 720 కేసులు నమోదు కాగా.. 442 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక డైలీ పాజిటివీటి రేటు 11.05 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2022,10:20 am

Today Corona Updates : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 1 లక్షా 94 వేల 720 కేసులు నమోదు కాగా.. 442 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక డైలీ పాజిటివీటి రేటు 11.05 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4, 868కు చేరుకుంది.

తాజాగా 60 వేల 405 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు…

2022 january 12 today corona updates in india

2022 january 12 today corona updates in india

జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది