Today Gold Rates : మహిళలకు గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి పెరగడం లేదు. తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతియ సందర్భంగ కూడా బంగారం ధరలు తగ్గాయి. నిన్న మే 4న మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఇవాళ మరోసారి బంగారం ధరలు తగ్గాయి. అయితే.. వెండి ధరలు మాత్రం ఇవాళ పెరిగాయి. నిజానికి.. ఒకప్పుడు బంగారం కొనడానికి ఎవ్వరూ పెద్దగా వెనుకాడేవారు కాదు కానీ.. ఈరోజుల్లో బంగారం కొనాలంటే మాత్రం చాలా కష్టం. బంగారం పేరు ఎత్తితే చాలు భయపడుతున్నారు. పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు ఈరోజుల్లో బంగారం కొనడం అనేది గగనంగా మారింది. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైనే వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. బంగారం ఒక గ్రాముకు 22 క్యారెట్లకు రూ.4700గా ఉంది. నిన్న రూ.4720గా ఉండేది. అంటే గ్రాముకు 20 రూపాయలు తగ్గింది. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.47,000 ఉంది. 10 గ్రాములకు రూ.200 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు బంగారం ధర రూ.5128గా ఉంది. నిన్న రూ.5151గా ఉండేది. అంటే.. ఇవాళ్టి ధరతో పోల్చితే రూ.23 తగ్గింది. 10 గ్రాములకు 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. అంటే రూ.230 తగ్గిందన్నమాట.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.47,000 ఉండగా… 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,100 కాగా 24 క్యారెట్లకు రూ.52,320గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా 24 క్యారెట్లకు రూ.51,280 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,000 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,280గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఇవాళ వెండి ధరలు పెరిగాయి. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.62.70గా ఉంది. అంటే ఒక గ్రాము మీద 40 పైసలు పెరిగిందన్నమాట. ఒక గ్రాముకు నిన్న రూ.62.30గా ఉండేది. 10 గ్రాములకు రూ.627గా ఉంది. నిన్న రూ.623గా ఉండేది. 10 గ్రాములకు 4 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర రూ.62,700గా ఉంది. నిన్న రూ.62,300గా ఉండేది. 400 రూపాయలు పెరిగింది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.670గా ఉంది. కిలో వెండి ధర రూ.67000గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.