Taxi Driver Ajay : టాక్సీ డ్రైవర్ కి ఓవర్ నైట్ లో 30 కోట్లు.. అదృష్టం అంటే ఇది.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Taxi Driver Ajay : టాక్సీ డ్రైవర్ కి ఓవర్ నైట్ లో 30 కోట్లు.. అదృష్టం అంటే ఇది.. వీడియో

 Authored By sekhar | The Telugu News | Updated on :24 December 2022,7:20 pm

Taxi Driver Ajay : ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నా.. కంపెనీలు మూతపడటంతో.. ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరోపక్క కరోనా విలయ తాండవం చేస్తూ ఉండటంతో ఆర్థిక మంద్యం ప్రపంచవ్యాప్తంగా తాండవిస్తోంది. దీంతో ధరలు పెరిగిపోయి ఎవరు బతకలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ BF 7 ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ ఉంది.

చైనాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీంతో మళ్లీ ప్రపంచం స్తంభించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక టాక్సీ డ్రైవర్ ఓవర్ నైట్ లో 30 కోట్లు గెలిచాడు. విషయంలోకి వెళ్తే జగిత్యాల జిల్లా బీర్ పుర్ మండలంకి చెందిన అజయ్.. దుబాయ్ లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. దాదాపు నాలుగు సంవత్సరాలు నుండి ఒక కంపెనీలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 30 దీర్హామ్స్ తో రెండు లాటరీ టికెట్ లు కొనడం జరిగింది.

Taxi driver Ajay Wins Crores In Dubai Lottery

Taxi driver Ajay Wins Crores In Dubai Lottery

ఇందులో ఒక దానికి బంపర్ డ్రా తగిలింది. 15 లక్షల దీర్హామ్స్ నీ అజయ్ గెలుచుకున్నాడు. 15 లక్షల దీర్హామ్స్ అంటే భారత్ కరెన్సీలో అక్షరాల ₹33 కోట్ల 80 లక్షలు. డ్రైవర్ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన అజయ్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావడంతో జగిత్యాల జిల్లాలో స్వగ్రామంలో వాళ్ల కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఒక రాత్రిలో అజయ్ జీవితం మారిపోవటంతో… కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త విన్న వాళ్ళందరూ ఇది అసలైన అదృష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది