Sagar by poll : టీఆర్ఎస్ పార్టీకి షాక్… సాగర్ ఉపఎన్నికలో 400 నామినేషన్లు?
Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో ఒక్కటే హాట్ టాపిక్. అదే నాగార్జునసాగర్ ఉపఎన్నిక. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని పార్టీలు తెగ ఆరాటపడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అప్పుడే రంగాన్ని సిద్ధం చేశాయి.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో చనిపోవడంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే… ఇప్పటికే జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కంటే… బీజేపీ మెరుగైన సీట్లు సాధించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ వెంటనే అలర్ట్ అయిపోయింది. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించింది.
ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో… ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచి మరోసారి తమ సత్తా చూపించాలని ఆరాటపడుతుంటే… బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో… కనీసం సాగర్ ఉపఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చూపించాలని ప్రణాళికలు రచిస్తోంది.
Sagar by poll : 400 నామినేషన్లు వేసిన అమరవీరుల కుటుంబాలు
ఈనేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అమరవీరుల కుటుంబాలు భారీ షాక్ ఇచ్చాయి. సాగర్ ఉపఎన్నిక కోసం ఏకంగా 400 నామినేషన్లను వేసి.. సీఎం కేసీఆర్ అవాక్కయ్యేలా చేశాయి. గతంలో కూడా నిజామాబాద్ ఎంపీ స్థానం ఎన్నిక కోసం… ఇలాగే పసుపు రైతులు వేల సంఖ్యలో నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇండిపెండెంట్ గా వేల మంది రైతులు నామినేషన్లు వేయడంతో… టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ఓడిపోయారు. ఆమె స్వయానా సీఎం కూతురు కావడంతో అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది.
తాజాగా… అదే సీన్ మళ్లీ రిపీట్ కావడంతో… ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమరవీరుల కుటుంబాలు సాగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేయడంతో వెంటనే తేరుకున్న టీఆర్ఎస్ హైకమాండ్… అమరవీరుల కుటుంబాలతో చర్చలు కూడా జరుపుతోందని సమాచారం. మీరు ఏం చేసినా.. సాగర్ ఉపఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తాం… అని అమరవీరుల కుటుంబాలు భీష్మించుకు కూర్చున్నాయట. చూద్దాం మరి.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఎన్ని మలుపులు తిరుగుతుందో?