Tax Pay : 50 వేలు జీతం పన్ను కట్టాలా వద్ద.. 1 లక్ష వాళ్లు ఏ పన్ను కట్టాలి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tax Pay : 50 వేలు జీతం పన్ను కట్టాలా వద్ద.. 1 లక్ష వాళ్లు ఏ పన్ను కట్టాలి..?

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2024,8:00 pm

Tax Pay : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతామన్ మంగళవారం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే అందులో పన్ను విధానాలపై కొన్ని సవరణలు చేశారు. పన్ను మినహాయింపుల గురించి.. స్లాబ్ మర్పుల గురించి ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ లో ఏడాదికి 50 నంచి 75 వేలకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఐతే ఈ మార్పు కొత్త విధానం వర్తిస్తుంది. చాలామందికి ఇప్పుడు ఒక ప్రశ్న మనసులో ఉంది. నెల జీతం 50 వేలు లేదా లక్ష రూపాయలు ఉన్న వారు ఎంత పన్ను చెల్లించాలి..? పాత పన్ను విధానం ఫాలో అవ్వాలా లేదా కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా.. ఏది తీసుకోవాలి అన్నది కన్ ఫ్యూజన్ ఏర్పడింది.

కొత్త పన్ను విధానం డీఫాల్ట్ గా ఉంది కాబట్టి దాన్ని ఎంచుకున్న తర్వాత మీరు పాత పన్ను నిర్మాణాన్ని ఎంచుకోవడం కష్టం. కొత్త పన్ను విధానం అమలులో కొనసాగితే.. జీతం 50, లక్ష రూపాయలినా చింతించాల్సిన పనిలేదు. వార్షిక వేతనం 6 లక్షల రూపాయలు అవుతుంది కాబట్టి మీ ఇన్వెస్ట్ మెంట్ ఇతర ఆదాయాలను పరిగణలోకి తీసుకోరు. 1 లక్ష జీతానికి పన్ను విధానం ఏది సరిపోతుంది.. లక్ష జీతం ఉంటే కొత్త పన్ను విధానం లేదా పాత పన్ను విధానం సరిపోతుందా అని ప్రశ్న వస్తుంది. లక్ష జీతం ఉండి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకూడనుకుంటే వారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐతే దాని కోసం గ్ర్ణ రుణం, మెడిక్లెయిం పాలసీ కొన్ని ఇతర వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి అందులో పెట్టుబడి పెట్టడం బెటర్.

Tax Pay ఒక లక్ష జీతైం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు..

పెట్టుబడి, రీయింబర్స్ మెంట్ క్లెయిం చేయాల్సిన పన్నుల నుంచి మినహాయింపు. రవాణా, వినోదం, ఇంటి బ్రాడ్‌ బ్రాండ్ బిల్లు, పెట్రోల్ బిల్లు, ఆహార కూపన్ లకు వినియోగిస్తే బెటర్. హెచ్ ఆర్ ఏ ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంటుంది. మెట్రో నగరానికి 50, దిగువ నగ్రానికి 40 శాతం క్లెయిం చేసుకోవచ్చు. పి.పి.ఎఫ్, ఈ.పి.ఎఫ్, ఈ.ఎల్.ఎస్.ఎస్, ఎన్.ఎస్.సి వంటి వంటి పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద లక్షన్నర దాకా పన్ను ఆదా.

Tax Pay 50 వేలు జీతం పన్ను కట్టాలా వద్ద 1 లక్ష వాళ్లు ఏ పన్ను కట్టాలి

Tax Pay : 50 వేలు జీతం పన్ను కట్టాలా వద్ద.. 1 లక్ష వాళ్లు ఏ పన్ను కట్టాలి..?

నేషనల్ పేమెంట్ సిస్టమ్ (ఎన్.పి.ఎస్)లో 50000 వరకు మొత్తంగా వార్షిక పెట్టుబడికి సెక్షన్ 80సుస్డిడి1భ్) కింద అదనంగా 50000 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక ఆరోగ్య బీమా కింద 25000 వరకు పొదుపు ఉంటుంది. అందులో భర్త, భార్య, పిల్లల పేర్లు ఉండాలి. పేరెంట్స్ లు ఆరోగ్య బీమా కొనుగోలుపై 50,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది