7th Pay Commission : ఈ ఉద్యోగులకి పెరిగిన 6 శాతం డీఏ… ఎంత సాలరీ అందుకోనున్నారో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి డీఏ పెంచుతానన్న విషయ తెలిసిందే.త్వరలో కీలక నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది జూలై నెలలో డీఏ పెంపు ఉండనుందని, డీఏ ఐదు శాతం పెంపు ఉండే అవకాశం ఉందని, అదే జరిగితే డీఏ 39 శాతానికి చేరనుంది ఎన్నో వార్తలు వచ్చాయి. ఏటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు. మొదట జనవరి నుంచి జూన్ వరకు ఇస్తారు. రెండోది జూలై నుంచి డిసెంబర్ వరకు వస్తుంది. అయితే ఛత్తీస్ గడ్ ప్రభుత్వం ఉద్యోగులకి 6 శాతం డీఏ పెంచనున్నట్టు ప్రకటించింది.
7th Pay Commission : డీఏ పెరుగుదల..
డీఏ పెంపుదల కనీసం 3.8 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మే నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం కింద 22 శాతం, 6వ వేతన సంఘం కింద 174 శాతం డీఏ పొందుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్‌ను సవరించిన తర్వాత, 7వ మరియు 6వ వేతన కమీషన్‌ల క్రింద వరుసగా 6 శాతం మరియు 15 శాతం పెంపుదల అమలులోకి వచ్చినట్లు రాష్ట్రం నుండి వచ్చిన ఉత్తర్వు పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఉద్యోగులకు 28 శాతం, 189 శాతం డీఏ లభిస్తుందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలిపింది.
ఈ పెంపు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.2,160 కోట్ల అదనపు భారం పడుతుందని ఆ ప్రకటన పేర్కొంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 22 నుంచి మళ్లీ సమ్మెకు దిగుతామని ఫెడరేషన్ ప్రకటించింది. ఆగస్టు 13న ఛత్తీస్‌గఢ్ కరంచారి అధికారి మహాసంఘ్ (సీఏకేఎం) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను కలిశారని, ఆయన డీఏను 6 శాతం పెంచేందుకు సమ్మతి తెలిపారని అధికారులు తెలిపారు.7వ వేతన సంఘం స్కేల్ ఆధారంగా హెచ్‌ఆర్‌ఏ పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.6 శాతం పెంపుతో సంతృప్తి చెందని సీఏకెమ్‌ప్రాంతీయ కన్వీనర్ కమల్ వర్మ మాట్లాడుతూ, రాష్ట్ర ఉద్యోగులు 7వ వేతన సంఘం స్కేల్ ప్రకారం 34 శాతం DA మరియు హెచ్ఆర్ఏ ఈ రెండు డిమాండ్‌లు నెరవేరలేదని అన్నారు.