7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హోలీ పండుగ గిఫ్ట్ ఇచ్చిన మోడీ సర్కారు..
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హోలీ పండుగ ఈ సారి ప్రత్యేకం కానున్నది. కరోనా కాలంలో ప్రభుత్వం వారికి గిప్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ పండుగ చాలా స్పెషల్ కానుంది. అసలే కరోనా టైంలో ఆర్థికంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ హోలీ పండుగకు వారికి ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఎస్‌బీఐ పర్సనల్ లోన్, ఎస్‌బీఐ ఇన్ స్టంట్ లోన్ ద్వారా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చే విషయమై కేంద్రం ప్రకటించింది.
దీని ప్రకారం ఉద్యోగులకు రూ.10వేలు ఇవ్వాలనే నిబంధన పెట్టనున్నట్టు సమాచారం. ఇలా ఉద్యోగులకు హోలీ పండుగ సందర్భంగా రూ.10 వేల అడ్వాన్స్‌గా అందే అవకాశముంది. మరో గుడ్ న్యూస్ ఎంటంటే దీనికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వడ్డీ చెల్లించాల్సిన పని సైతం ఉండదు. ఇందుకు మార్చి 2022 వరకు మాత్రమే చాన్స్ ఉంది.గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఈ ఆఫర్ ఇచ్చింది. పండుగల సమయంలో ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్స్ ముందే లోడ్ చేస్తారు. ఇక ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ. వెయ్యి చొప్పున పది నెలల్లో వాయిదా పద్దతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
7th Pay Commission : నెలకు వెయ్యి చొప్పున..
ఇందుకు సంబంధించి సుమారు రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు వరకు అవసరం ఉంటుంది. మరి ఈ అడ్వాన్స్ నిజంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వల్ల చాలా మంది ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది.