7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ బొనాంజా.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు గుడ్ న్యూస్ లు ఉన్నాయి. వాళ్ల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఒకటి డీఏ పెంపునకు సంబంధించింది కాగా.. మరొకటి 18 నెలల డీఏ బకాయల గురించి.. ఇంకొకటి పీఎఫ్ వడ్డీకి సంబంధించి. ఇవన్నీ కలిపితే ఒక్క నెలలోనే లక్షల జీతాన్ని అందుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే ఏడో వేతన సంఘం డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేసింది. జులైలో కేంద్రం 6 శాతం వరకు డీఏను పెంచే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న డీఏతో పోల్చితే పెరిగిన డీఏ 40 శాతం వరకు వెళ్లే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏడో వేతన సంఘం సిఫారసులను పరిగణనలోకి తీసుకొని ఈనెలలో డీఏను పెంచేందుకు, దాని గురించి ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని కేంద్రం.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీట్ లో తీసుకుంది. జులై 31న డీఏ పెంపుపై ప్రకటనను వెలువరిచే అవకాశం ఉంది. ఒకవేళ డీఏ 6 శాతం పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరనున్నాయి. అలాగే.. 18 నెలల డీఏ బకాయిలను కేంద్రం ఇప్పటి వరకు ఉద్యోగుల అకౌంట్లలో వేయలేదు.
7th Pay Commission : జులై 31న డీఏ పెంపుపై ప్రకటన
జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ బకాయిలను కూడా ఈ నెలలోనే జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో వేయాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. ఒకేసారి ఒక్క ఉద్యోగికి బకాయిలు కనీసం 2 లక్షల వరకు అకౌంట్ లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే.. పీఎఫ్ వడ్డీని కూడా ఈ నెలలోనే జమ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పీఎఫ్ వడ్డీ 8.10 శాతంగా ఉంది. ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వడ్డీని కూడా ఈనెలలో జమ చేసే అవకాశాలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల త్రిపుల్ బొనాంజా పొందే చాన్స్ ఉంది.