7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరాకు బంపర్ ఆఫర్.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 September 2022,6:00 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నిజానికి జులై నుంచే డీఏ పెంపు జరగాల్సి ఉంది. కానీ.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపు విషయంపై కేంద్ర క్యేబినేట్ పలుమార్లు సమావేశం అయింది. ఇప్పటికే మార్చిలో డీఏను కేంద్రం పెంచింది. మళ్లీ జులైలో పెంచాల్సి ఉంది కానీ.. లేట్ అయింది. అయితే.. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ తగలనుంది. ఒకేసారి జీతాలు భారీగా పెరగనున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా ఉద్యోగులకు భారీ నజరానా ప్రకటించనుంది. డీఏ పెంపుపై కూడా త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 28 న నవరాత్రి వేడుకలు ప్రారంభం అయిన తర్వాత డీఏ పెంపుపై కేంద్రం ప్రకటన చేయనుంది. ఈసారి డీఏ 4 శాతం పెరగనుంది. 4 శాతం పెరిగితే డీఏ.. 38 శాతం కానుంది. డీఏ పెంపుతో పాటు.. జులై, అగస్టు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను కూడా కేంద్రం చెల్లించనుంది. నిజానికి.. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. జనవరి, జులై నెలల్లో సవరిస్తూ ఉంటుంది. ఈసంవత్సరం జనవరిలో పెంచాల్సిన డీఏను కేంద్రం మార్చిలో పెంచింది. ఇక.. జులైలో పెరగాల్సిన డీఏను సెప్టెంబర్ లో పెంచుతూ.. బకాయిలను కూడా చెల్లించబోతోంది.

7th Pay Commission central govt to announce da hike before dussehra

7th Pay Commission central govt to announce da hike before dussehra

7th Pay Commission : గత మార్చిలో 34 శాతానికి డీఏను పెంచిన కేంద్రం

గత మార్చి నెలలో 3 శాతం డీఏను కేంద్రం పెంచింది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను 3 శాతానికి పెంచింది. దీంతో 31 శాతంగా ఉన్న డీఏ కాస్త 34 శాతానికి ఎగబాకింది. డీఏతో పాటు డీఆర్ ను కూడా 3 శాతానికి పెంచింది. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 1.16 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. మార్చిలో పెంచినప్పటికీ జనవరి 1, 2022 నుంచి డీఏ పెంపును అమలు చేసింది కేంద్రం. దీంతో జనవరి, ఫిబ్రవరి రెండు నెలల బకాయిలతో పాటు మార్చి నుంచి పెంచిన డీఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేశారు. మార్చిలో పెంచిన డీఏ కూడా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా పెరగబోయే డీఏను కూడా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు పెంచనుంది. ఇప్పట్లో 8 వ వేతన సంఘం వచ్చే అవకాశం కూడా లేదని కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, డీఆర్, పే స్కేల్, జీతాల పెంపు అన్ని విషయాలను కేంద్రం.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే నిర్ణయించనుంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి