7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 46 శాతానికి పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గత జూన్ లోనే డీఏ పెరగాల్సి ఉంది. కానీ.. ఇంకా పెరగలేదు. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. గత జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. పెంపు మాత్రం జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఆరునెలలకు అంటే జూన్ లో పెరగాల్సిన డీఏ ఇంకా పెరగలేదు. మార్చిలో పెరిగిన డీఏతో కలుపుకొని 42 శాతం అయింది డీఏ.
అంటే.. 38 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 42 శాతం అయింది. 42 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు పెరిగి 46 శాతం కానుంది. అంటే మరోసారి 4 శాతం డీఏను కేంద్ర ప్రభుత్వం పెంచబోతోంది. నిజానికి.. ప్రస్తుతం ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ను ఆధారంగా చేసుకొని డీఏను పెంచుతారు. గత జూన్ కు సంబంధించిన ఇండెక్స్ కూడా వచ్చేసింది. జూన్ ఇండెక్స్ చూస్తే.. 136.4 పాయింట్లు ఉంది. మేలో ఉన్న పాయింట్లు 134.7 కంటే అది 1.7 పాయింట్లు అదనంగా ఉంది.అందుకే డీఏను ఈసారి కూడా బాగానే పెంచాల్సి వస్తోంది. డీఏ ప్రస్తుతం 42 శాతం ఉండగా దాన్ని పెంచి 46 శాతం చేస్తారని అంటున్నారు. అయితే.. జూన్ లోనే పెరగాల్సిన డీఏ పెంపుపై ఇప్పటి వరకు ప్రకటన రాలేదు.
7th Pay Commission : డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు?
వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో పెరిగినా కూడా కూడా డీఏ పెంపు బకాయిలను జూన్ నుంచే ఇవ్వనున్నారు. దీని వల్ల ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా జీతాలు పెరగనున్నాయి. మార్చిలో కేంద్ర కేబినేట్ డీఏ పెంపు నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు 38 శాతంగా డీఏ ఉండేది. ప్రతి సంవత్సరం డీఏ పెంపు వల్ల కేంద్రంపై రూ.12,815.60 కోట్ల అదనపు భారం పడుతుంది. కానీ.. 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.