7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 18 నెలల డీఏ బకాయిల చెల్లింపు లేనట్టేనా? ప్రభుత్వం ఏమంటోంది?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఎప్పుడెప్పుడా అని డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కేంద్రం బ్యాడ్ న్యూసే చెప్పింది. కొత్త సంవత్సరం కానుకగా పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేస్తారని ఉద్యోగులకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. 18 నెలల డీఏ, డీఆర్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కొత్త సంవత్సరం పూట బ్యాడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కోవిడ్ 19 వల్ల కేంద్ర ప్రభుత్వం మీద పడ్డ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే 18 నెలల డీఏ బకాయిలను
ప్రస్తుతానికి ఉద్యోగులకు చెల్లించకుండా వాటిని ఫ్రీజ్ చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. కేంద్రం త్వరలోనే 18 నెలల డీఏ బకాయిలపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన జారీ చేసింది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన డీఏ బకాయిలపై స్పష్టతనిచ్చారు. జనవరి 1, 2020 నుంచి చెల్లించాల్సి ఉన్న డీఏ బకాయిలను ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో బకాయిలను త్వరలోనే చెల్లిస్తారని, కొత్త సంవత్సరం కానుకగా చెల్లిస్తారని అంతా భావించారు.
7th Pay Commission : రాజ్యసభలో డీఏ బకాయిలపై స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
దసరా, దీపావళి సందర్భంగా చెల్లిస్తారని భావించినా.. చివరకు కొత్త సంవత్సరం కానుకగా చెల్లిస్తారని భావించారు. కానీ.. ఇప్పుడు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రస్తుతానికి డీఏ బకాయిల చెల్లింపును ఫ్రీజ్ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలపై పలు అసోషియేషన్ల నుంచి రెప్రజెంటేషన్స్ వచ్చాయని మంత్రి పంకజ్ తెలిపారు. ప్రస్తుతానికి డీఏ, డీఆర్ బకాయిలను చెల్లించకుండా ఉన్నందుకు ప్రభుత్వానికి రూ.34,402 కోట్లు ఆదా అయినట్టు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.