7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ బకాయిలు, పెంపుపై కొత్త అప్ డేట్.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి కాదు.. రెండు శుభవార్తలు. అవును.. లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. ఎందుకంటే.. ఓవైపు డీఏ పెంపు, బకాయిలు, అలాగే ప్రమోషన్స్ గురించి కూడా కొత్త అప్ డేట్ వచ్చింది. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వనున్నారు. ప్రమోషన్ వస్తే జీతం కూడా భారీగా పెరుగుతుంది. ఈ ప్రాసెస్ ను 31 జులై వరకు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే..
జులైలోనే డీఏ పెంపు, బకాయిల చెల్లింపుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అప్రైజల్ తో పాటు డీఏ బెనిఫిట్ కూడా ఈ నెలలోనే ఉద్యోగులు పొందనున్నారు. నిజానికి.. ప్రతి సంవత్సరం జనవరి, జులై.. రెండు నెలలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం పెంచుతుంది. గత జనవరిలో పెంచాల్సిన డీఏను కేంద్రం మార్చిలో పెంచింది. ఈ సంవత్సరం డీఏ సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ ను జులైలో ప్రకటించనున్నారు.
7th Pay Commission : జనవరిలో పెంచాల్సిన డీఏను మార్చిలో పెంచిన కేంద్రం
గత మార్చిలో 3 శాతం పెంచి 31 శాతంగా ఉన్న డీఏను 34 శాతం చేశారు. జులైలో దాన్ని 4 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఒకవేళ 4 శాతం పెంచితే 34 శాతం నుంచి 38 శాతానికి డీఏ పెరుగుతుంది. దీని వల్ల.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. డీఏ పెంపుతో పాటు 18 నెలల డీఏ బకాయిలను కూడా జులై జీతంతో పాటు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఓవైపు డీఏ పెంపు, మరోవైపు డీఏ బకాయిలు, ఇంకోవైపు ప్రమోషన్స్ అన్నీ కలిపితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కసారిగా జీతాలు పెరగనున్నాయి.