7th Pay Commission : ఉద్యోగులకు గుడ్ న్యూస్… అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం !
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కేంద్రం పెద్ద ప్రకటన ప్రకటించింది. ఉద్యోగులు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే బిల్డింగ్ అడ్వాన్స్ పై వడ్డీ రేటుని తగ్గించింది. అంటే బ్యాంకు నుంచి తీసుకున్న హోమ్ లోన్ పై వడ్డీ రేటు 7.9% నుంచి 7.1 శాతానికి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఎంతో లాభం పొందనున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి బ్యాంకు నుండి తీసుకున్న హోమ్ లోన్ ని తిరిగి ఉద్యోగులు ఇచ్చే అడ్వాన్స్ పై ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. తాజాగా 0.8 శాతం తగ్గించబడింది.
ఇప్పుడు ఉద్యోగులకు సొంత ఇల్లు ఉండాలని కల నెరవేర్చుకునేందుకు మరింత ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ వడ్డీని ఉద్యోగులు మార్చ్ 31 2023 వరకు పొందవచ్చు. గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ నివేదికను జారీ చేసింది. అడ్వాన్స్ వడ్డీ రేట్ల తగ్గింపు గురించి తెలియపరిచింది. ప్రభుత్వం వెల్లడించిన దీని ద్వారా ఉద్యోగులు ఇప్పుడు సంవత్సరానికి 7.1 శాతం చొప్పున మార్చి 31, 2023 వరకు అడ్వాన్స్ పొందవచ్చు. ఇది ఇంతకుముందు సంవత్సరానికి 7.9% ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో మంచి జరగనుంది. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఎంత అడ్వాన్స్ తీసుకోవచ్చు అనే ప్రశ్న ఎదురై ఉంటుంది.

7th Pay Commission good news for central government employees
అయితే ప్రభుత్వం అందించిన ఈ ప్రత్యేక సదుపాయం కింద ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం ప్రకారం 34 నెలల వరకు లేదా గరిష్టంగా 25 లక్షల వరకు రెండు మార్గాల్లో అడ్వాన్స్ పొందవచ్చు. అలాగే ఇంటి ఖర్చు నుండి ఉద్యోగులకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని అడ్వాన్స్ గా పొందవచ్చు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవ్వడం విశేషం. ఇందులో ఉద్యోగి తన పేరు లేదా తన భార్య పేరుతో తీసుకున్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి అడ్వాన్స్ తీసుకోవచ్చు. కేంద్ర అమలుపరిచిన ఈ పథకం అక్టోబర్ 1, 2020 నుండి మొదలైంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మార్చి 31 2023 వరకు ఉద్యోగులకు 7.1% వడ్డీ రేటు గృహ నిర్మాణ అడ్వాన్స్ ను అందజేస్తుంది.