7th Pay Commission : గుడ్ న్యూస్.. మార్చి 31లోపు పెరగనున్నప్రభుత్వ ఉద్యోగుల జీతం
7th Pay Commission : 2021-22 ఆర్థిక సంవత్సరం దాదాపు మార్చి 31తో ముగియనుంది మరియు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో శుభవార్త వింటారని ఆశించవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఉద్యోగుల బేసిక్ జీతం కూడా పెరగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే పెంచేలా కనపడుతోందని పలు మీడియా రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది. కనీస వేతనాలను పెంచాలని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.26 వేలు చేయాలని అనుకుంటున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 టైమ్స్ నుంచి 3.68 టైమ్స్ పెంచాలని అడుగుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కనుక పెంచారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా పెరుగుతాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రేట్ల తో రూ.18 వేల బేసిక్ వేతనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం పెంపుదల ప్రకటిస్తే, ఫలితంగా వారి జీతాలు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రస్తుతం 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతం పొందుతున్నారు, దీనిని 3.68 శాతానికి పెంచితే, మూల వేతనంలో రూ. 8,000 పెరుగుతుంది.అంటే బేసిక్ పే రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది.ఏడవ వేతన సంఘం సిఫారసులను కేంద్ర కేబినెట్ 2017 జూన్‌లో ఆమోదించింది. అప్పుడు బేసిక్ వేతనాన్ని రూ.7 వేలు పెంచి, రూ.18 వేలకు తీసుకు రావడం జరిగింది.
7th Pay Commission : వరుస శుభవార్తలు..
ఇది ఇలా ఉంటే సెక్రటరీ స్థాయి ఉద్యోగుల వేతనాన్ని రూ.90 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది. ఈ లెక్కల ప్రకార చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ.18,000 నుంచి రూ.26,000కి పెరగనుంది. ఇదిలా ఉంటే కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) లభిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్డిసెంబర్ 2021 డేటాను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డీఏను మూడు శాతం పెంచవచ్చు. దీంతో కేంద్ర ఉద్యోగులకు డీఏ 34 శాతం కానుంది.