7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మరో గుడ్ న్యూస్… హెచ్ఆర్ఏ కూడా పెరగనుందంటూ వార్తలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎంతో కాలంగా వేచిచూస్తోన్న డియర్‌నెస్ అలవెన్స్ పెంపును బుధవారం చేపట్టింది. ప్రస్తుతమున్న డీఏను 31 శాతం నుంచి మరో 3 శాతం పెంచుతూ కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దీంతో మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతానికి పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతోన్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడం ఉద్యోగులకు ఊరటగా మారింది. డీఏ, డియర్‌నెస్ రిలీఫ్ పెరగడంతో.. కేంద్రం ఖజానాపై ఏడాదికి రూ.9,544.50 కోట్ల భారం పడనుంది. పెంచిన డీఏలు ఈ ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.
మోదీ ప్రభుత్వం ఈ నెలలో ఉద్యోగులకు జీతాల పెంపు బహుమతిని ఇవ్వనుంది. డీఏ తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం ఇతర అలవెన్సులను పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందనే అంచనాలు కూడా పెరిగాయి. హెచ్‌ఆర్‌ఏను గతేడాది జూలైలో పెంచారు. ఆ తర్వాత డీఏను కూడా 25 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. ఇప్పుడు డీఏను 34 శాతానికి పెంచినందున హెచ్‌ఆర్‌ఏను కూడా సవరించవచ్చు. ప్రస్తుతం ఈ నగరాల్లోని ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 27 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు. Y కేటగిరీ నగరాలకు ఈ పెరుగుదల 2 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 18-20 శాతం హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది
7th Pay Commission : మరో బంపర్ ఆఫర్..
Z కేటగిరీ నగరాలకు 1 శాతం HRA పెంచవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులకు HRA 9-10 శాతం చొప్పున ఇవ్వబడుతుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు కనీసం రూ.18 వేల వేతనం లభిస్తుంది. డీఏ 34 శాతానికి పెరగడంతో.. ఉద్యోగుల వేతనం కూడా పెరగనుంది. నెలకు రూ.6,120 మేర ఎక్కువ వేతనాన్ని ఉద్యోగులు పొందనున్నారు. డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ వేతనంపై లెక్కిస్తారు. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), గ్రాట్యుటీ మొత్తాలు కూడా పెరుగుతాయి. డియర్‌నెస్ అలవెన్స్‌ను సమీక్షించిన తర్వాత.. నెలవారీ కంట్రిబ్యూట్ చేయాల్సిన పీఎఫ్, ట్రావెల్ అలవెన్స్‌లను కూడా పెంచుతారు.