7th Pay Commission : నెలాఖరులోగా కీలక నిర్ణయం.. త్వరలోనే గుడ్ న్యూస్ విననున్న ఉద్యోగులు
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు అందనుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెంపు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం వీలైనంత త్వరగానే గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో పాటు డీఏ బకాయిల్ని విడుదల చేయనుంది. ఈసారి 3 శాతం డీఏ పెరుగుతుందని అంచనా. ఇదే జరిగితే 34 శాతం డీఏ అందుకోనున్నారు ఉద్యోగులు. ప్రతీ ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏ పెరుగుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడల్లా పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది. 2022 జనవరికి సంబంధించిన డీఏ, డీఆర్ పెరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం హోళీ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కేంద్ర సర్కార్ ప్రతి సంవత్సరం రెండు సార్లు డియర్నెస్ అలవెన్స్ పెంచుతుంది. ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలలో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. డీఏ పెంపు మార్చిలో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అంతకు ముందు జూలై 1, 2021 నుంచి అమల్లోకి వచ్చే 28 శాతం నుంచి బేసిక్ పేలో 31 శానికి పెంచింది. ఈ నిర్ణయం దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి డీఏ 3 శాతం పెరిగితే 34 శాతం డీఏ లభించనుంది. అంటే రూ.18,000 బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.73,440 వార్షిక డీఏ లభిస్తుంది. గరిష్టంగా వార్షికంగా రూ.2,32,152 డీఏ లభించే అవకాశం ఉంది. బేసిక్ వేతనాన్ని బట్టి డీఏ లెక్కిస్తారు కాబట్టి బేసిక్ వేతనం ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ డీఏ లభిస్తుంది.
7th Pay Commission : ఈ వార్తతో ఉద్యోగులు ఫుల్ హ్యాపీ
AICPI డేటాను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ డేటా ప్రకారం 3 లేదా 4 శాతం డీఏ పెరగొచ్చు. ఈసారి 3 శాతం డీఏ పెంచుతారని అంచనా. ఇక ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు 18 నెలల డీఏ బకాయిలు రావాల్సి ఉంది. డీఏ బకాయిల్ని సింగిల్ సెటిల్మెంట్‌లో రిలీజ్ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిల్ని ఒకేసారి రిలీజ్ చేస్తే ఉద్యోగులకు రూ.2,00,000 వరకు బెనిఫిట్ లభించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనాన్ని లెక్కించేందుకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది.