7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు కన్ఫర్మ్.. జీతం ఎంత పెరగనుందో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో తీపి కబురును త్వరలో చెప్పనుంది. ఏడవ వేతన సంఘం సిఫారసు మేరకు త్వరలోనే డీఏ పెంచే అవకాశం ఉంది. నిజానికి గత మార్చిలోనే డీఏను కేంద్రం పెంచింది. కానీ.. ఏడవ వేతన సంఘం సూచనల ప్రకారం.. ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలలో అప్పటి ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి డీఏ పెంచుతారు. కానీ.. ఈసారి జనవరిలో కాకుండా మార్చిలో డీఏను పెంచారు.
ఆ తర్వాత డీఏను జులైలో పెంచుతున్నారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో 4 శాతం డీఏను పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రకారం డీఏ, డీఆర్ ను పెంచుతారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతం అందుతోంది. 34 శాతంలో 4 శాతం కూడా పెంచితే మొత్తం 38 శాతం పెరుగుతుంది. డీఏను ఉద్యోగి బేసిక్ శాలరీ ఆధారంగా లెక్కిస్తారు. అలా ఉద్యోగి జీతం కూడా పెరుగుతుంది.
7th Pay Commission : డీఏ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు?
ఇతర అలవెన్స్ లను తీసేయగా వచ్చేదే బేసిక్ పే. అయితే.. డీఏ బకాయిలపై ఇంకా కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. కోవిడ్ కారణంగా కేంద్రం డీఏ బకాయిలను చెల్లించలేదు. సంవత్సరానికి పైగా డీఏ చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఇంకా చెల్లించలేదు. వాటిని ఈ నెలలో జమ చేస్తారా? లేదా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక.. ఈ నెలలో డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి చేరితే జీతం ఒక్కసారిగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగనున్నాయి.