7th Pay Commission : ఉద్యోగులకి గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన డీఏ
7th Pay Commission : గత కొద్ది రోజులుగా డీఏకి సంబంధించి అనేక ప్రచారాలు, వార్తలు హల్‌చల్ చేస్తుండగా, ఎట్టకేలకు త్రిపుర ప్రభుత్వం ఉద్యోగులకి 5 శాతం డీఏను పెంచనుంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపు ఉంటుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం లేదా 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి కలిపి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ఈసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు 5 శాతం డీఏ, డీఆర్ పెరగనుందన్న వార్తలు వస్తున్నాయి.
7th Pay Commission : బంపర్ ఆఫర్..
అయితే త్రిపురలో డీఏ పెరగడం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 1,04,683 మంది ఉద్యోగులు.. 80,855 మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. మొత్తంగా 1,88,494 మంది లబ్ధి పొందనున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. దాంతో 7.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది. మోదీ ప్రభుత్వం కూడా త్వరలో డీఏపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
7th Pay Commission on Tripura government hikes 5 percent da
ఇది ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రిపుర ప్రభుత్వం నిర్ణయం జూలై 1 2022 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకునేందుకు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 5 శాతం డీఏ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 5 శాతం డీఏ పెంచితే ఉద్యోగులకు అది శుభవార్తే. ఉద్యోగులకు 39 శాతం డీఏ లభించనుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది.