నోయిడాలో వృద్ధాప్యంలో కన్నతల్లిని నిర్లక్ష్యం చేసిన కొడుకు.. దారుణమైన చావు..!!
ప్రస్తుత రోజుల్లో సమాజంలో చాలా దారుణమైన పరిస్థితిలు కనిపిస్తున్నాయి. కాన్నీ, పెంచి, పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను చూసే పిల్లలు చాలా వరకు కనుమరుగైపోతున్నారు. వృద్ధాప్యంలోకి వస్తే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది ఏకంగా నిర్మానుష్యమైన ప్రాంతంలో విడిచిపెట్టి మరీ వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది వృద్ధాశ్రమంలో వదిలేసి చేతులు దులుపెసుకుంటున్నారు. దీంతో చాలామంది దిక్కులేని చావు చేస్తున్నారు. కన్న ప్రేమను నోచ్చుకోలేక తల్లడిల్లి పోతున్నారు. సరిగ్గా ఇదే తరహాలో నోయిడాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. 70 సంవత్సరాలు వయసు కలిగిన అభియా సీన్హా అనే వృద్ధురాలు నర్స్ చేసి రిటైర్ కావడం జరిగింది.
15 సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుని కొడుకుతో నోయిడాలో నివాసం ఉంటుంది. కొడుకు పేరు ప్రణవ్ సీన్హా.. అయితే వృత్తి రీత్యా బిజినెస్ కోసం ఘజియాబాద్ లో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు నోయిడాలో తల్లినీ చూసుకుంటూ వెళ్లేవాడు. కొడుకు ప్రణవ్ అంటే తల్లి అభియా సీన్హాకి మహా ప్రేమ. ఎప్పటికప్పుడు కొడుకు క్షేమ.. సమాచారాలు అందుకోవడం మాత్రమే కాదు.. త్వరగా ఇంటికి రావాలని ఫోన్ లు చేస్తూ బాగా పట్టించుకునేది. అయితే కొన్ని రోజులు బిజినెస్ పనిలో నిమగ్నమైపోయి తల్లి ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె తల్లడిల్లిపోయి మనేద పెట్టుకుని ఇంటిలో చనిపోయింది.
అనంతరం ప్రణవ్ తల్లికి ఫోన్ చేస్తున్న ఎత్తకపోవడంతో వెంటనే నోయిడాలో తల్లి ఇంటికి చేరుకోగా లోన గడి పెట్టి ఉండటంతో ఎంత తలుపు కొట్టిన తీయలేదు. ఈ క్రమంలో కిటికీ తీయగానే దుర్గంధం ఒక్కసారిగా రావడంతో తలుపులు పగలగోట్టి లోన కెల్లగానే తల్లి శవం కుళ్ళిపోయింది. ఆ స్థితిలో తన తల్లిని చూసుకుని ప్రణవ్ తల్లడిల్లిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. పోస్టుమార్టం చేస్తే 20 రోజుల క్రితమే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కన్న బిడ్డలే చూసుకునే పరిస్థితులు మళ్లీ రావాలని కామెంట్లు పెడుతున్నారు.