Mother And Son : అయ్యా.. నా కొడుకును చంపెయ్యండి..ఈ బాధ తట్టుకోలేకపోతున్నా.. ఓ తల్లి ఆవేదన ఇది.. వీడియో..!
ప్రధానాంశాలు:
Mother And Son : అయ్యా.. నా కొడుకును చంపెయ్యండి..ఈ బాధ తట్టుకోలేకపోతున్నా.. ఓ తల్లి ఆవేదన ఇది.. వీడియో..!
mother And Son : జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఒక తల్లి ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టించింది. “నా కొడుకును చంపెయ్యండి.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నా” అంటూ కన్నీరు పెట్టుకుంది. లక్ష్మి అనే ఈ మహిళ గత 30 ఏళ్లుగా తన కుమారుడిని కంటికిరెప్పలా చూసుకుంటోంది. ఆమె కుమారుడు చిన్నతనం నుంచే కాళ్లు, చేతులు చచ్చుబడిన స్థితిలో ఉన్నాడు. అతని కోసం జీవన పోరాటం చేస్తున్న లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడంలేదని వాపోయింది.

Mother And Son : అయ్యా.. నా కొడుకును చంపెయ్యండి..ఈ బాధ తట్టుకోలేకపోతున్నా.. ఓ తల్లి ఆవేదన ఇది.. వీడియో..!
Mother And Son : ఆదుకోండి.. లేదంటే నా కొడుకును చంపేయండి – తల్లి కన్నీటి వేదన
లక్ష్మి కుటుంబానికి నెలకు వచ్చేది కేవలం రూ.4,000 మాత్రమే. ఆ డబ్బుతో ఇంటి ఖర్చులు, కొడుకుని ఆరోగ్య సంరక్షణను నెట్టలేకపోతున్న, ఇందిరమ్మ ఇల్లు లేదని, విద్యుత్ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆమె వాపోయింది. ఆమె కూలి పనులకు వెళ్లినా, తమకు ప్రభుత్వ పథకాలు ఎందుకు వర్తించవు అని ప్రశ్నిస్తోంది. ఎన్ని సార్లు అధికారులను కోరినా తమ బాధపై స్పందన లేకపోవడం వల్ల చివరికి ఈ విధంగా తన భావోద్వేగాన్ని బయటపెట్టుకుంది.
లక్ష్మి వేదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తుంది. ఆమె కోరింది పెద్దగా ఏమీ లేదు. తన కొడుకును కాపాడండి..ప్రభుత్వ పథకాలు అందివ్వమని అడుగుతుంది. ఇలాంటి ఘటన లపై ప్రభుత్వం దయతో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీస బేసిక్ అవసరాలైన ఆవాసం, వైద్య సహాయం, నిరంతర ఆదాయం వంటి అంశాల్లో సాయం చేయడం మాత్రమే కాదు, ఇలాంటి కుటుంబాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం. మరి ప్రభుత్వం లక్ష్మి విషయంలో ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి.
ఆదుకోండి.. లేదా నా కొడుకును చంపేయండి: తల్లి కన్నీటి వేదన
కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తూ జనగామ కలెక్టరేట్‌కు వెళ్లింది. ఎవరూ స్పందించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. ‘4000 పెన్షన్ డైవర్లకే సరిపోవట్లేదు.… pic.twitter.com/43EBTRpozB
— ChotaNews App (@ChotaNewsApp) April 29, 2025