Mother And Son : ఇదేం రిలేషన్.. తల్లి, కొడుకు భార్య భర్తలయ్యారుగా..!
ప్రధానాంశాలు:
Mother And Son : ఇదేం రిలేషన్.. తల్లి, కొడుకు భార్య భర్తలయ్యారుగా..!
Mother And Son : బాలీవుడ్ నుంచీ టాలీవుడ్ వరకు ఎన్నో ప్రేమకథలు, ప్రేమవివాహాలు మనం చూసాం ప్రేమ పెళ్లిళ్లు ఈ మధ్య వరుసగా విడాకుల బాట పట్టడం కూడా చూస్తున్నాం. కానీ కొన్ని ప్రేమకథలు మాత్రం ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ తరహా లవ్ స్టోరీ లలో ప్రముఖ నటి కిష్వర్ మర్చంట్ అలానే నటుడు సుయాష్ రాయ్‌లది. ఈ జంట ఓ టీవి సీరియల్‌లో తల్లి-కొడుకు పాత్రల్లో నటించగా.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి, చివరికి భార్యాభర్తలుగా మారారు.

Mother And Son : ఇదేం రిలేషన్.. తల్లి, కొడుకు భార్య భర్తలయ్యారుగా..!
Mother And Son భలే కుదిరింది..
2010లో ప్రారంభమైన ‘ప్యార్ కీ యే ఒక కహానీ’ అనే సీరియల్‌లో కిష్వర్ తల్లి పాత్రను పోషించగా.. సుయాష్ ఆమె కొడుకుగా నటించాడు. తెరపై తల్లి కొడుకులుగా కనిపించిన ఈ జంట నిజ జీవితంలో మాత్రం భార్య భర్తలు కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. కిష్వర్ తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో.. మొదట సుయాష్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కాబోయే కోడలు పెద్దదని వ్యతిరేకత వ్యక్తం చేశారు.
కానీ ప్రేమకు ఏది అడ్డు కాదని నిరూపిస్తూ తల్లిదండ్రులను ఒప్పించి.. 2016లో ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. మరోవైపు కిష్వర్ మర్చంట్ మాత్రం టీవీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకుంది. ప్యార్ కీ యే ఒక కహానీ, ఏక్ హసీనా థీ, ఇత్నా కరో నా ముఝే ప్యార్ వంటి హిట్ సీరియల్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.