Woman : మూడుసార్లు చనిపోయి బ్రతికిన మహిళ .. ప్రతీసారి ఆమె ఆత్మ ఈ పని చేసేదట ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Woman : మూడుసార్లు చనిపోయి బ్రతికిన మహిళ .. ప్రతీసారి ఆమె ఆత్మ ఈ పని చేసేదట ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :3 June 2023,9:00 pm

Woman ; ప్రతి మనిషికి పుట్టుక, చావు రెండు కచ్చితంగా ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషికి చావు అనేది తప్పకుండా ఉంటుంది. అయితే చచ్చిన మనిషికి బ్రతకడం అనేది అసాధ్యం. కానీ కొన్ని సంఘటనలలో మనుషులు చావు దగ్గర వెళ్లి వెనక్కి వచ్చారు. కానీ చనిపోయిన మనిషి మళ్లీ బ్రతికినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. అలాంటిది ఓ మహిళ తాను నెలలో మూడుసార్లు చనిపోయానని చెప్పింది. అంతేకాదు చనిపోయిన తర్వాత ఆత్మగా మారి దేవుడిని, ప్రముఖుల్ని కలిశానని కూడా చెప్పింది. ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని బిర్కెన్ హెడ్ లో జరిగింది. 57 ఏళ్ల బీబెర్లీ గిల్ మర్ తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు బ్రెయిన్ ట్రోమా వచ్చింది.

A woman who died three times and survived

A woman who died three times and survived

దీంతో ఆమె చనిపోయిన అనుభవాన్ని పొందింది. ఆ సమయంలో ఆమె గుండె కొట్టుకోవడం ఆగింది. శరీరం మెల్లగా పనిచేయకుండా పోవడం జరిగింది. కొద్ది సమయం తర్వాత ఆమె ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుంది. అది శూన్యంలోని మరికొన్ని ఆత్మలను కలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె వాల్ట్ డిస్నీ కంపెనీ అధినేత వాల్ట్ డిస్నీని కలిసింది. ఆయన ఆమెతో చాలా కథలు చెప్పాడు. ఆయన ఉండే ప్రదేశంలో ఓ అద్భుతమైన కట్టడం ఉంది. చెక్కతో చేసినది ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఆమె కోమాలోంచి బయటికి వచ్చాక వాల్ట్ డిస్నీ చెప్పిన వాటన్నింటిని రాసుకుంది. బొమ్మలను కూడా గీసింది.

ఆయన కథలో పాత్రగా కూడా మారింది. వాల్ట్ డిస్నీ చెబుతున్నప్పుడు ఆమె శ్రద్ధగా వినేది. అలాగే ఆమె ఆత్మగా మారినప్పుడు తన తండ్రిని కూడా చూసింది. మొదటిసారి ఆమె అతన్ని కలిసినప్పుడు ఆయన వయసు 52 ఏళ్ళ లాగా అనిపించింది. ఎందుకంటే అతడు ఆ వయసులోనే చనిపోయాడు. రెండోసారి చూసినప్పుడు 30 ఏళ్ల లాగా కనిపించాడు. తన కూతుర్ని చూసిన ఆనందంలో ఆయన ఎంతో సంతోషంగా కనిపించాడు. ఇలా ఆమె చనిపోయిన ప్రతిసారి ఎవరో ఒక ప్రముఖులను చూస్తూ ఉండేదట. అలాగే జీసస్ ను కూడా కలిసిందట. ఆయనతో స్నేహం కూడా చేసిందట.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది