Aadhaar Card : ఆధార్ కార్డు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే… ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి…
Aadhaar Card : ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. గవర్నమెంట్ నుంచి ఏదైనా నగదును పొందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. అది లేకపోతే ఏ పని కావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి అవసరాలకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోతుంది. అయితే చాలామందికి ఆధార్ కార్డు సంబంధించి ఎన్నో సమస్యలు ఉంటాయి. పేరు తప్పుగా వాడడం, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వి తప్పులు పడుతూ ఉంటాయి. వాటిని సరి చేసుకోవడానికి ఆధార్ సెంటర్ కి వెళ్లి సరి చేసుకోవాల్సి ఉంటుంది.
కొందరికి ఆధార్ కార్డులను తప్పులను సరిదిద్దుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి, ఎలా సరి చేసుకోవాలి అనే విషయాలు సరిగ్గా తెలియదు. అలాంటి వారికి హైదరాబాద్ యుఐడి ఏఐ ప్రాంతీయ కార్యాలయం ఓ విషయాన్ని వెల్లడించింది. ఆధార్ కి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించి పరిష్కరించుకోవచ్చని తెలిపింది. ఏదైనా ప్రశ్నలుంటే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1947కు సంప్రదించాలని తెలిపింది.
ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంప్రదించవచ్చు. అలాగే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి ఏవైనా సందేహాలు ఉంటే సమాధానం తెలుసుకోవాలని ట్వీట్ లో పేర్కొంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ సందేహాలను పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలకైనా వారు సమాధానం ఇస్తారు. ఇందుకు సలహాలు, సూచనలు పొందవచ్చు.