Kathi Mahesh Died : కత్తి మహేశ్ ఇక లేరు.. చికిత్స పొందుతూ చెన్నైలో మృతి

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 10 July 2021, 5:54 pm

Kathi Mahesh : తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటుడు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ ఇక లేరు. ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు పది రోజుల కింద యాక్సిడెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తనకు యాక్సిడెంట్ కావడంతో చెన్నైకి తీసుకెళ్లి.. అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

actor kathi mahesh died in chennai hospital

actor kathi mahesh died in chennai hospital

Kathi Mahesh : నెల్లూరు జిల్లాలో కారు యాక్సిడెంట్

కత్తి మహేశ్.. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. నెల్లూరు జిల్లాలోని గూడూరు దగ్గర ఆయన కారు యాక్సిడెంట్ జరిగింది. కారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో.. మహేశ్.. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యారు. కళ్లు కూడా దెబ్బతిన్నాయి. వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. ఆయన పరిస్థితి విషమించడంతో.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

actor kathi mahesh died in chennai hospital

actor kathi mahesh died in chennai hospital

కత్తి మహేశ్ కు ఇప్పటికే అపోలో వైద్యులు చాలా సర్జరీలు చేశారు. ఆయన ముక్కు, కళ్లు అయితే చిధ్రం అయిపోయాయి. ఇటీవల ఆయన ఆరోగ్యం కొంచెం కుదుటపడటంతో ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కానీ.. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయన ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం కూడా సాయం చేసింది. కానీ.. ఆయన ప్రాణాలు మాత్రం నిలవలేదు.

actor kathi mahesh died in chennai hospital

actor kathi mahesh died in chennai hospital

చెన్నై, నెల్లూరు జాతీయ రహదారిపై గత నెల 26న కత్తి మహేశ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసమయంలో కారులో కత్తి మహేశ్ తో పాటు ఆయన కారు డ్రైవర్ కూడా ఉన్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మహేశ్ ను నెల్లూరులోని కార్పోరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకోగానే.. ఏపీ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 17 లక్షల రూపాయలను అపోలో ఆసుపత్రికి చెల్లించింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!

ఇది కూడా చ‌ద‌వండి ==>  అప్పుడలా.. ఇప్పుడిలా.. వైర‌ల్ అవుతున్న వంట‌ల‌క్క రేర్ ఫిక్స్‌

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి