ఈ జబ్బు ఉంటే కష్టమే.. సెకన్లలో ప్రవర్తన మారిపోతుంది.. ఎక్కడా నిలకడగా కాసేపు కూర్చోలేరు?
ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోగాలు తక్కువేమీ కాదు. రోజుకో కొత్త రోగం కూడా పుడుతోంది. జనాభా పెరుగుతున్నా కొద్దీ.. కాలుష్యం పెరుగుతున్నా కొద్దీ.. మానవాళి పర్యావరణానికి హాని చేస్తున్నా కొద్దీ.. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. శారీరక రోగాల కంటే.. ఈ మధ్య మానసిక రోగాలు ఎక్కువయ్యాయి. దాని వల్ల చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి మానసిక రోగంలో అతి డేంజర్ అయిన జబ్బు.. ADHD. అంటే.. Attention deficit hyperactivity disorder.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. అయితే.. ఈమధ్య పెద్దల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో.. ప్రతి ఒక్కరు ఈ జబ్బు మీద దృష్టి కేంద్రీకరించాల్సిందే.
ఒక మనిషి ఎక్కువగా నిరాశలో ఉన్నా.. ఒత్తిడిని ఎదుర్కొంటున్నా కూడా ADHD సోకే ప్రమాదం ఉంటుంది. బాల్యంలోనే ఎక్కువ ఒత్తిడికి గురయినా, వారసత్వ జీన్స్ ద్వారా కూడా పిల్లల్లో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. గర్భంతో ఉన్నప్పుడు.. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. పొగ తాగడం, మద్యం సేవించడం, లేదా ఇతర డ్రగ్స్ లాంటివి తీసుకుంటే.. అవి పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. దాని వల్ల.. పుట్టిన పిల్లలకు ఈ సమస్య సోకే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా ఎప్పుడూ ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది.
ADHD లక్షణాలు ఏంటి?
ఈ జబ్బు ఉందని తెలుసుకోవడం ఎలా అంటే? పిల్లలు అయినా పెద్దలు అయినా సరే.. ఎక్కువ సేపు కూర్చోలేరు.. ఎప్పుడూ పరధ్యానంలో ఉంటారు. సెకన్ల వ్యవధిలో తమ ప్రవర్తన మారిపోతుంటుంది. ఏ పనీ చేయలేకపోవడం, ఎదుటివాళ్లు మాట్లాడేది వినకపోవడం, ప్రతి విషయానికి గందరగోళానికి గురి కావడం లాంటివి జరుగుతాయి. అయితే.. ఈ వ్యాధిలోనే మూడు రకాలు ఉంటాయట. ఒకటి హైపర్ యాక్టివ్, రెండోది ఇంపల్సివిటీ, మూడోది కేర్ లెస్ నెస్.
హైపర్ యాక్టివ్ అంటే.. ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించడం. ఎక్కువగా రియాక్ట్ అవడం, ఆవేశ పడటం, తొందర పాటుకు గురికావడ లాంటి లక్షణాలు ఉంటాయి. అదే ఇంపల్సివిటీ అంటే.. రిజర్వ్ డ్ గా ఉండటం.. యాక్టివ్ గా లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. అదే కేర్ లెస్ నెస్ అంటే.. దేన్నీ పట్టించుకోకపోవడం, ఎదుటి వారు చెప్పేది అస్సలు వినకపోవడం లాంటివి ఉంటాయి.
అయితే.. ఈ జబ్బుకు పరిష్కారం.. రెండే మార్గలు. ఒకటి వాళ్ల ప్రవర్తనను మార్చే కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా.. మెడిసిన్ ద్వారా తగ్గించడం. ప్రస్తుతం ఈరెండు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. పిల్లలకైనా.. పెద్దలకైనా.. ఈ జబ్బు రాకముందే జాగ్రత్త పడటం మంచిది. ముఖ్యంగా పిల్లలను ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా.. ఎక్కువ నిరాశకు గురిచేయకుండా ఉంచగలగాలి. అప్పుడు ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు.