Teff Flour : మీకు షుగర్ ఉందా? వెంటనే ఈ పిండి తినేయండి.. దెబ్బకు షుగర్ తగ్గాల్సిందే?
Teff Flour : ప్రస్తుతం ఎన్నో రోగాలు మనుషులను చుట్టుముడుతున్నాయి. అసలు.. ఎప్పుడు ఏ రోగం వస్తుందో కూడా ఎవ్వరికి తెలియదు. అది ఏ రోగమో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. అందుకే.. ఈ జనరేషన్ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే పది కాలాల పాటు చల్లగా ఉంటారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఇక అంతే. ప్రస్తుతం షుగర్ అనే వ్యాధి ఎలా విస్తరిస్తుందో అందరికీ తెలుసు. అందుకే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం.. చాలామంది వెనకటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మన తాతలు, ముత్తాతలు తినే తిండి కోసం పాకులాడుతున్నారు. గటక, జొన్న రొట్టెల వైపు మొగ్గు చూపుతున్నారు.
రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు లాంటి చిరు ధాన్యాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. వాటిలో ఎక్కువగా ఉండేది ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్. అందుకే.. ప్రస్తుతం ఈ జనరేషన్ ఈ చిరు ధాన్యాల వైపు మళ్లుతున్నారు. అయితే.. ఈ చిరు ధాన్యాల గురించి మనందరికీ తెలుసు. కానీ.. మనకు తెలియని చిరు ధాన్యాలు ఏంటో తెలుసా? టెఫ్. ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ ఫుడ్.
Teff Flour : టెఫ్ ఫుడ్ లో ఉండే ప్రత్యేకతలేంటి? ఎందుకు ఈ ఫుడ్ వైపు జనాలు మళ్లుతున్నారు?
టెఫ్ అనేది కూడా చిరు ధాన్యమే. జొన్నల్లాగానే ఉంటాయి. వీటిని ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో పండిస్తారు. టెఫ్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే.. ప్రొటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్స్ తీసుకుంటారు. ఐరన్, మినరల్స్, కాల్షియం, జింక్.. ఇలా అన్ని రకాల పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
అలాగే.. దీంట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్లకు టెఫ్ ను తినాలంటూ డాక్టర్లు సూచిస్తున్నారు. దీన్ని పిండిగా చేసుకొని రొట్టెలుగా కాల్చుకొని తీసుకోవచ్చు. లేదంటే గటకలా చేసుకొని కూడా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు కూడా టెఫ్ ను తినొచ్చు. దీంట్లో కాపర్ కూడా అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగాలన్నా.. టెఫ్ ను తినాల్సిందే. చపాతీలు చేసుకొని కానీ.. దోసెలుగా చేసుకొని కానీ.. బ్రెడ్, కుకీస్ గా, కేక్ గా కూడా టెఫ్ ను చేసుకొని తినొచ్చట. మీకు ఎలా ఇష్టంగా ఉంటే.. అలా చేసుకొని వాడుకోవచ్చు.