
Ysrcp
Ysrcp మంత్రిపదవిపై ఆశ.. ఏకంగా ఓ నలుగురు నేతల భవిష్యత్ నే దెబ్బకొట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తయారైంది. మంత్రిపదవి కోసం వేసిన రాంగ్ స్టెప్ భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చేసింది. ఇప్పుడు కక్కలేక మింగలేక అన్న చందంగా వారి రాజకీయ జీవితం తయారైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలకు పసుపు కండువాలు కప్పేశారు. వీరిలో నలుగురికైతే, ఏకంగా మంత్రిపదవులు కూడా ఇచ్చారు. ఆ నలుగురు రెండేళ్లపాటు మంత్రులుగా ఓ రేంజ్ లో అధికారం వెలగబెట్టారు. మంత్రులుగా వారు ఆయా జిల్లాల్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కట్ చేస్తే రెండేళ్లలో వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా చిత్తుగా ఓడి చివరకు నియోజకవర్గంలో.. సొంత పార్టీలో కూడా పట్టు నిలుపుకునే పరిస్థితిలో కూడా లేకుండా పోయారు. ఆ మాజీ మంత్రులు కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన భూమా అఖిలప్రియ, బొబ్బిలి రాజు సుజయ కృష్ణరంగరావు, చిత్తూరు నేత అమర్నాథ్ రెడ్డి.
TDP
ఈ నలుగురు 2014లో వైసీపీ Ysrcp ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో భూమా అఖిల, అమర్నాథ్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీకి చెందిన వారే. సుజయ్, ఆది ఇద్దరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా గెలిచి 2014లో వైసీపీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో నలుగురూ ఓడిపోయారు. వీరు మంత్రులుగా ఉన్నంత కాలం నియోజకవర్గంలో వైసీపీ వాళ్లను అణగదొక్కడంతో పాటు టీడీపీ కేడర్‌ను పట్టించుకోకుండా ఆకాశంలోనే ఉన్నారు. దీంతో కనీసం వీరిని సొంత కేడర్ కూడా పట్టించుకోవడం లేదు. అందుకే సుజయ్, అమర్నాథ్ కనీసం నియోజకవర్గంలో కూడా ఉండడం లేదు.
Ysrcp
ఏకంగా చెన్నై, బెంగళూరు వెళ్లిపోయి, తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక అఖిలప్రియ వరుస వివాదాల్లో ఇరుక్కోవడంతో పాటు జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఆ టైంలో కనీసం ఆమెను పార్టీ నేతలు పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణ టీడీపీని వీడి సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్లారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలిసిందే. అక్కడ ఆదిని పట్టించుకునే వాళ్లు, నమ్మే వాళ్లు కూడా లేరు. దీంతో అక్కడ నామ్ కే వాస్తేగా ఉన్నట్లేనని టాక్ నడుస్తోంది.
twist in bowenpally kidnap case bhuma akhilapriya
బొబ్బిలిలో సుజయ్‌ను తప్పించేసిన చంద్రబాబు ఆయన సోదరుడు బేబీ నాయనకు టీడీపీ పగ్గాలు అప్పగించేశారు. సుజయ్ పొలిటికల్ లైఫ్‌కు శుభం కార్డే అంటున్నారు. అఖిల ఇదే తీరుతో ఉంటే ఆమె రాజకీయంగా నిలదొక్కుకునే పరిస్థితులు లేవు. ఇక ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఇబ్బంది పడుతున్నా, తర్వాత అయినా ఆయన టీడీపీలోకి రాకుండా పోతారా ? అనే వాళ్లే ఎక్కువ. మంత్రి పదవి మీద వ్యామోహంతో జంప్ చేసినా, కేడర్ ను పట్టించుకోకపోవడమే వీరికి పెద్ద దెబ్బ కొట్టిందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో నాడు వీళ్లు మంత్రి పదవి మీద ఆశతో పార్టీ మారకుండా ఉండి ఉండే ఈ రోజు ఐదేళ్ల పాటు అధికారం ఎంజాయ్ చేసేటోళ్లేనన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కేడర్ కూడా కోల్పోవడంతో, ఇక వీరి రాజకీయాలకు శుభం కార్డు పడినట్లేనని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారట. ఈ నేపథ్యంలో మళ్లీ జంపింగ్ దిశగా ఆలోచిస్తున్నా, పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ నలుగురి భవిష్యత్ ఏమిటో .. వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి ==> అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?..
ఇది కూడా చదవండి ==> త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ… మంత్రుల్లో టెన్షన్ మొదలు.. ఎవరు సేఫ్… ఎవరు ఔట్..?
ఇది కూడా చదవండి ==> ఏపీ బీజేపీ కీలక నేత చూపు వైసీపీ వైపు..?
ఇది కూడా చదవండి ==> జగన్ ను డీ కొట్టడానికి టీడీపీ భారీ ప్లాన్.. పీకే టీమ్‌తో నారా లోకేష్…!
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.