ys jagan : త్వ‌ర‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ… మంత్రుల్లో టెన్షన్ మొదలు.. ఎవ‌రు సేఫ్‌… ఎవ‌రు ఔట్‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ys jagan : త్వ‌ర‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ… మంత్రుల్లో టెన్షన్ మొదలు.. ఎవ‌రు సేఫ్‌… ఎవ‌రు ఔట్‌..?

 Authored By sukanya | The Telugu News | Updated on :5 July 2021,3:30 pm

ys jagan ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీ అధికారం చేపట్టింది. అప్పుడు మంత్రి పదవులపై ఆశావాహలు ఎక్కువగా ఉండడంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు సామాజిక సమీకరణాల విషయంలో రాజీ పడకుండా అందర్నీ ఒప్పించి సీఎం జగన్ ys jagan కేబినెట్ కూర్పు చేశారు. దీంతో కేబినెట్‌ బెర్తులపై ఎక్కడా విమర్శలు ఎదురుకాలేదు. కానీ చాలమంది సీఎం నిర్ణయంపై బయటకు చెప్పుకోలేకపోయినా లోలోన మదనపడుతున్నరన్న విషయం గ్రహించిన జగన్.. అప్పట్లో ఎదురైన భారీ పోటీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 90 శాతం మంత్రుల్ని రెండున్నరేళ్ల తర్వాత మార్చి వారిస్ధానంలో మరొకరికి చోటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేతలంతా రెండున్నరేళ్లు ఓపిక పడదామంటూ సర్దుకుపోయారు. సీఎం జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో మరోసారి కేబినెట్‌ మార్పులకు సిద్ధమవ్వాల్సి ఉంది. దీంతో ఇప్పుడంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారైనా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానం ముందు లాబీయింగ్ మొదలెట్టారు.

Ys Jagan

Ys Jagan

మంత్రులుగా ఎవరు సేఫ్ ? ys jagan

కొందరు మంత్రుల్లో కూడా టెన్షన్ మొదలైంది. తమ బెర్త్ లు సేఫా కాదా అని లెక్కలు వేసుకుంటున్నారు. త్వరలో చేపట్టే కేబినెట్‌ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రుల స్ధానంలో కొత్తగా అమాత్యులయ్యే వారిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే తొలి విడత కేబినెట్‌ విస్తరణ తర్వాత పిల్లిసుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి ఎంపీలు కావడంతో మధ్యలో మంత్రులుగా వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు స్థానాలు ప్రస్తుతానికి సేఫ్ అనే చెప్పాలి. వీరితో పాటు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌ యాదవ్, కన్నబాబు, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుగ్గన స్ధానాలు సేప్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు.. సామాజిక సమీకరణాల లెక్కన వీరంతా సేఫ్ గా ఉన్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Ysrcp

Ysrcp

దక్కకపోతే జంప్ దిశగా.. ys jagan

అయితే ఈ సారి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా భారీగానే ఉంది. శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, స్పీకర్‌ తమ్మినేని, రోజా, పార్ధసారధి, జోగి రమేష్‌, తోట త్రిమూర్తులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి వంటి వారు కూడా కేబినెట్‌ బెర్తుల కోసం పోటీలో ఉన్నారు. అయితే సమీకరణాల పేరుతో తమను పక్కనబెడితే మాత్రం ఈ సారి పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరించడం.. ఎన్నికలకు ముందు వేరే పార్టీలోకి మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, నిఘా నివేదికలు, పార్టీ నేతల నివేదికలు తెప్పించుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏపీ బీజేపీ కీల‌క నేత‌ చూపు వైసీపీ వైపు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జ‌గ‌న్ ను డీ కొట్ట‌డానికి టీడీపీ భారీ ప్లాన్‌.. పీకే టీమ్‌తో నారా లోకేష్…!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?

ఇది కూడా చ‌ద‌వండి ==> కేసీఆర్ లో ఇంత మార్పేంటి..? ఈటెల కు భయపడ్డడా..?

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది