Amaravathi : అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amaravathi : అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?..

 Authored By kondalrao | The Telugu News | Updated on :6 July 2021,7:00 am

Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత/తాత్కాలిక/శాసన రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి ప్రాంతంలో పెద్దఎత్తున భూములను సేకరించటంలో కుంభకోణం చోటు చేసుకుందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ మొదటి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను సైతం బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చా

క ఆ స్కామ్ పై విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ భూముల సేకరణ వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు అనే చర్చ జరుగుతోంది. తెర ముందున్నది మాత్రం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అనే విషయం విధితమే.

amaravathi land scam

amaravathi land scam

వాళ్లిద్దరి అనుబంధం ఈనాటిది కాదు..

అమరావతి రాజధాని భూముల కుంభకోణం వెనక ఉన్నది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సాంబశివరావు అని వైఎస్సార్సీపీ శాసన సభ్యుడు (మంగళగిరి నియోజకవర్గం) ఆళ్ల రామకృష్ణారెడ్డి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఆయన అంటున్నదాంట్లో ఏమాత్రం అబద్ధంలేదని తెలుస్తోంది. ఎందుకంటే అప్పట్లో జరిగిన సంఘటనలన్నీ సాంబశివరావు వైపే వేలెత్తి చూపుతున్నాయి. సాంబశివరావుకి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకి మధ్య అనుబంధం ఈనాటిది కాదు. సాంబశివరావు సీనియర్ ఐఏఎస్ గా ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత కూడా వాళ్లిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతోంది. సాంబశివరావు ఐఏఎస్ గా రిటైర్ అయ్యాక చంద్రబాబు సంస్థ హెరిటేజ్ లో చేరి ఉన్నత స్థాయిలో పనిచేశారు.

2004కి ముందు..: Amaravathi

chandrababu

chandrababu

చంద్రబాబు 2004కి ముందు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండో సారి సీఎంగా ఉన్నప్పుడు ఈ సాంబశివరావు అన్నీ తానై అన్నట్లు వ్యవహరించేవారు. దీన్నిబట్టి చంద్రబాబు నాయుడు సాంబశివరావుకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ చట్టాల గురించి, వాటిలోని లోటుపాట్ల గురించి సాంబశివరావుకి కొట్టింది పిండి. కాబట్టి అమరావతిని ఏపీ రాజధానిగా అధికారికంగా ప్రకటించకముందే అక్కడి భూముల గురించి చంద్రబాబు సాంబశివరావుతో స్టడీ చేయించారని, తద్వారా చేతికి మట్టి అంటకుండా పనికానిచ్చారని చెబుతున్నారు.

2014లోనే..

చంద్రబాబు నాయుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజధాని ఎంపికపై చర్చించేందుకు కొంత మంది ముఖ్యులతో భేటీ అయ్యారు. వారిలో సాంబశివరావు ఒకరు. రాజధానిని ప్రకటించక ముందే అమరావతిలోని భూములన్నింటినీ టీడీపీ నేతలు కొనుగోలు చేయటంలో సాంబశివరావు కీలక పాత్ర పోషించారని అంటున్నారు. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కలిసి సాంబశివరావే సర్వం చేసిపెట్టారని చెబుతున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ లను సైతం లాక్కోవటం, దానికి తగ్గట్లు జీవోలను జారీ చేయటం వంటివన్నీ సాంబశివరావే చూసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇది కూడా చ‌ద‌వండి ==> త్వ‌ర‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ… మంత్రుల్లో టెన్షన్ మొదలు.. ఎవ‌రు సేఫ్‌… ఎవ‌రు ఔట్‌..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏపీ బీజేపీ కీల‌క నేత‌ చూపు వైసీపీ వైపు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జ‌గ‌న్ ను డీ కొట్ట‌డానికి టీడీపీ భారీ ప్లాన్‌.. పీకే టీమ్‌తో నారా లోకేష్…!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది