Heart Attack | సిక్స్ కొట్టి కుప్పకూలిన క్రికెటర్.. గుండెపోటుతో మృతి చెందాడని చెప్పిన వైద్యులు
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన అనంతరం గుండెపోటుతో మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు సీపీఆర్ చేసి, అతన్ని హుటాహుటిన ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సదరు బ్యాటర్ వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

#image_title
నిజంగా ఘోరం..
ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో పేరిట నిర్వహించే ఓ ఫేక్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. వాస్తవానికి ఈ అకౌంట్‌కు అతనికి సంబంధం లేదు. ప్రస్తుతం ఈ అకౌంట్‌ను లక్షమంది ఫాలో అవుతున్నారు.దేశంలో ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఇందులో 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది పంజాబ్‌లో జరిగిన టోర్నీలో ఓ బ్యాటర్ గుండెపోటుకు గురయ్యాడు.
ఓ బెంగాల్ క్రికెటర్ జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోనూ ఓ యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తీవ్రమైన వ్యాయామాలు గుండెపై ఒత్తిడి చేస్తాయని, గుండె పోటుకు కారణమవుతాయని, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టకుండా గుండె ఒత్తిడికి గురయ్యేలా ఆటలు ఆడటం, అధిక తీవ్రత వ్యాయామాలు చేయడం సరికాదని కార్టియాక్ సర్జన్స్ సూచిస్తున్నారు.
A batter died of cardiac arrest after hitting a six 😨 pic.twitter.com/kJaFIrIVCw
— Richard Kettleborough (@RichKettle07) August 24, 2025