Meals : అన్నం తిన్నాక ఈ పని చేశారో… కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్టే.. ఎంత డేంజరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Meals : అన్నం తిన్నాక ఈ పని చేశారో… కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్టే.. ఎంత డేంజరో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 May 2021,7:10 pm

Meals : మీల్స్ అదేనండి భోజనం.. మన భాషలో చెప్పాలంటే అన్నం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అన్నమే తింటారు కాబట్టి.. ఎవరైనా కలిసినా కూడా అన్నం తిన్నారా? అని అడుగుతాం కానీ.. రొట్టెలు తిన్నారా? లేక చపాతీలు తిన్నారా? అని అడగం. లేదంటే భోం చేశారా అని ఆంధ్రా ప్రాంతంలో అడుగుతుంటారు. ఏది ఏమైనా అన్నానికి.. అదేనండి.. భోజనానికి మనం ఇచ్చే ప్రాధాన్యతే వేరు. రోజులో కనీసం రెండుసార్లు భోం చేయాల్సిందే. ఉదయం పూట ఎలాగోలా అల్పాహారంతో నెట్టుకొచ్చినా.. మధ్యాహ్నం, రాత్రి పూట మాత్రం ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. లేకపోతే అసలు ఏ పని చేయలేం. రోజుల్లో ఒక్కసారి అన్నం తినడం మానేసినా.. ఆ రోజంతా నీరసంగా ఉంటుంది. దాని కారణం.. కడుపులో సరైన శక్తి లేకపోవడం. అందుకే.. భూమి బద్ధలు అయినా సరే.. టైమ్ కు కడుపులో ఇంత ముద్ద పడాల్సిందే.

after meals not to eat these foods healthy tips telugu

after meals not to eat these foods healthy tips telugu

అయితే.. కొందరు అన్నం తినగానే కొన్ని పనులు చేస్తుంటారు. వేరేటివి తింటుంటారు.. తాగుతుంటారు. అసలు.. అన్నం తిన్న తర్వాత ఏం తినాలో? ఏం తినొద్దో? చాలామందికి తెలియదు. దాని వల్ల అనేక అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. భోజనం చేశాక కొన్ని పనులను అస్సలు చేయకూడదట. ఆ పనులను చేస్తే.. కోరి అనారోగ్యాన్ని శరీరంలోకి తెచ్చుకున్నట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఆ కొన్ని పనులు ఏంటి? ఎందుకు ఆ పనులను అన్నం తిన్న తర్వాత చేయకూడదో తెలుసుకుందాం రండి.

Meals : టీ, కాఫీలు, సిగరేట్ జోలికి పోయారో అంతే?

అన్నం తినగానే కొందరైతే వెంటనే టీ, కాఫీలు తాగేస్తుంటారు. అది చాలా డేంజర్. అన్నం తినగానే టీ కాఫీలు తాగితే.. లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే.. కనీసం అన్నం తిన్న గంట తర్వాత టీకాఫీలను తాగితే మేలు. చాలామంది అన్నం తినగానే సిగరేట్ కాల్చుతుంటారు. అది కూడా డేంజరే. ఎందుకంటే.. అన్నం తినగానే ఒక్క సిగరేట్ తాగినా.. అది 10 సిగరేట్లతో సమానం. అంతే కాదు.. రోజూ అలాగే అన్నం తినగానే సిగరేట్ తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.చాలామందికి తినగానే నిద్ర వస్తుంటుంది. అసలు.. అన్నం తినగానే నిద్ర పోకూడదు. అది చాలా డేంజర్. తినగానే నిద్ర పోతే.. కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయట. తినగానే కొందరు స్నానం చేస్తుంటారు. అది కూడా తప్పు. తినగానే స్నానం చేస్తే రక్తప్రసరణ తగ్గి.. తిన్న అన్నం వెంటనే జీర్ణం కాదు. దీంతో అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

అన్నం తిన్న అరగంట తర్వాత స్నానం చేయొచ్చు. అలాగే.. అన్నం తినగానే కొందరు పండ్లు తినేస్తుంటారు. అన్నం తినగానే పండ్లు తినకూడదు. కాసేపు ఆగాలి. లేదంటే శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోతుంది.కొందరైతే అన్నం తినేటప్పుడు మంచి నీళ్లు లేకపోతే అసలు అన్నమే తినరు. నిజానికి.. అన్నం తినగానే మంచినీళ్లు తాగకూడదు. అన్నం తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే.. తిన్న అన్నం జీర్ణం కాదట. దానికి కారణం ఏంటంటే.. తిన్న అన్నం జీర్ణాశయంలోకి వెళ్లాక.. జీర్ణాశయం.. ఆ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది. అన్నం తినగానే.. ఎక్కువగా మంచినీళ్లు తాగితే.. ఆ నీళ్లు కూడా జీర్ణాశయంలోకి వచ్చి.. ఆమ్లాల ఘాడతను తగ్గిస్తాయి. దీంతో తిన్న అన్నం వెంటనే జీర్ణం కాదు. అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే.. అన్నం తిన్న రెండు గంటల తర్వాత నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది