Husband and Wife : భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే వారు అన్యోన్యంగా ఉంటారు.. రీజన్స్ ఏంటి..?
ప్రధానాంశాలు:
Husband and Wife : భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే వారు అన్యోన్యంగా ఉంటారు.. రీజన్స్ ఏంటి..?
Husband and Wife : పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఆడ మగ ఇష్టపడి చేసుకునే కార్యక్రమం. ఐతే దానికి వయసుతో సంబంధం ఉంటుంది. అమ్మాయిలు అయితే 18, అబ్బాయిలకు 21 ఇలా ఇద్దరికి ఆయా ఏజ్ లలో పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. అంతకన్నా తక్కువ వయసులో చేసుకునే అవకాశం లేదు. 18 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను చేసుకుంటే అది బాల్య వివాహం కింద చూస్తారు. ఐతే సైన్స్ ప్రకారం అసలు భార్యా భర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలన్నది చూస్తే కొంత సమాధానం దొరుకుతుంది. అబ్బాయిల్లో, అమ్మాయిల్లో శారీరక అభివృద్ధి వేరు వేరుగా జరుగుతుంది. అమ్మాయిలు అయితే 12 నుంచి 13 ఏళ్ల వయసులో యుక్త వయసుకి వస్తారు. ఈ ఏజ్ లోనే వారికి పీరియడ్స్ రావడం జరుగుతుంది. ఒక అమ్మాయి 16 నుంచి 17 ఏళ్ళ వయస్సులో పూర్తి స్థాయి యుక్త వయసు లో వచ్చేస్తుంది. ఆ టైం లో ఆమె శారీరక అభివృద్ధి పూర్తి అయినట్టే. అందుకే అమ్మాయిలకు 18 ఏళ్లు పెళ్లి వయసు గా నిర్ణయించారు. ఆ టైం లో వారికి సంతానోత్పత్తి పూర్తి స్థాయిలో ఉంటుంది.
Husband and Wife 16 ఏళ్లకు యుక్త వయసు..
ఇక అబ్బాయిల విషయానికి వస్తే 15, 16 ఏళ్లకు యుక్త వయసు వచ్చినా 20, 21 ఏళ్లు వస్తే పురుషుడిగా మారతాడు. ఈ టైం లో అబ్బాయిలు పెళ్లికి రెడీ అయినట్టే అవుతుంది. ఇక సైన్స్ విషయానికి వస్తే.. మ్యారేజ్ కి ఏజ్ తో ఎలాంటి సంబంధం లేదు. పెద్దవాళ్లైన ఎవరైనా ఏ ఏజ్ లో అయినా పెళ్లి చేసుకోవచ్చు. ఐతే భార్యా భర్తల మధ్య 3 నుంచి 5 ఏళ్లు గ్యాప్ ఉంటే మంచిది అని చెబుతుంటారు. ఆ టైం లో వారి దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉంటుంద్దని చెబుతారు.
ఐతే ఇలా కాదు భార్యా భర్త మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటే వారి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహ బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ కాదు వారి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ అని చెప్పొచ్చు.