TRS Vs BJP, Congress Enjoying the game
Huzurabad తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బండి సంజయ్ వర్సెస్ రేవంత్ దిశగా తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బలహీనపర్చి, తమ బలం పెంచుకోవాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ ల వ్యూహం అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అందుకే బండి సంజయ్, రేవంత్ లు పాదయాత్ర చేపడుతున్నారని కేడర్ చర్చించుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మళ్లీ జోష్ చూపించేందుకు సమాయాత్తం అవుతోంది. బండి సంజయ్ సారధ్యంలో దుబ్బాక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ ముందు వరుసలో నిలిచింది.
all parties new plan on Huzurabad by poll
ఇప్పుడు మరోమారు హుజురాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దూకుడు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పేందుకే బీజేపీ పాదయాత్ర చేపట్టింది. బండి సంజయ్ ఆగస్టు 9న చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు, ఐదు విడతలుగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టి రానున్నారు. ఆ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టాయి. తొలి విడతలో పాదయాత్ర .. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నుంచి సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపటంతో పాటు రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టేందుకేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
BJP
ఇక కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకువచ్చేందుకు నూతన రధసారథి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో జులై సెకండ్ వీక్ నుంచి పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి, కేసీఆర్ ను ఎండగట్టాలని యోచిస్తున్నారట. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అని చెప్పాలని, పనిలో పనిగా బండి సంజయ్ దూకుడుకు చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, ప్రజాక్షేత్రంలో బలం పెంపొందించుకోవడానికి బిజెపి, కాంగ్రెస్ లు రంగంలోకి దిగనున్నాయి.
Revanth reddy
ఇరు పార్టీల రథసారథులు పాదయాత్ర చేపట్టి సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టాలని, తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు నిరూపించుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బండి పాదయాత్ర రెండురోజుల్లో ప్రారంభం కానుండగా, పీసీసీ ఛీఫ్ రేవంత్ మాత్రం .. రెండోవారం నుంచి చేపట్టాలని భావించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ కు, మరోవైపు బండికి చెక్ పెట్టాలని, ఈలోపు కాంగ్రెస్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడమే రేవంత్ ముందున్న అసలు సమస్యగా విశ్లేషకులు అంటున్నారు. అయితే బండి సైతం రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు .. విడతల వారీగా పాదయాత్రలకు ప్లాన్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> పదో తరగతి పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఇది కూడా చదవండి ==> ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?
ఇది కూడా చదవండి ==> కేసీఆర్ లో ఇంత మార్పేంటి..? ఈటెల కు భయపడ్డడా..?
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.