Anganwadi Jobs : పదో తరగతి పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
Anganwadi Jobs : తెలంగాణకు చెందిన మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని కోసం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది. పదో తరగతి పాస్ అయిన మహిళలందరూ దీనికి అర్హులే. కాకపోతే.. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మరిన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

telangana anganwadi jobs notification released
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 135 అంగన్ వాడీ ఖాళీలు ఉన్నాయి. వాటి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు.. రాష్ట్ర మహిళా, సంక్షేమ అధికారి కార్యాయలం వెల్లడించింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తును ఈనెల అంటే జులై 15వ తేదీలోగా నింపాల్సి ఉంటుంది.
Anganwadi Jobs : ఎలా అప్లయి చేయాలి?
అంగన్ వాడీ పోస్ట్ కోసం.. ఆన్ లైన్ విధానంలో అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం.. అర్హత ఉన్న అభ్యర్థులు.. https://mis.tgwdcw.in/Default.aspx ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాలి. జులై 15 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 135 ఖాళీలలో అంగన్వాడీ టీచర్లు 36, అంగన్ వాడీ ఆయాలు 83, మినీ అంగన్ వాడీ టీచర్లు 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.దరఖాస్తు చేసేటప్పుడు.. కొన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.

telangana anganwadi jobs notification released
దాని కోసం పుట్టిన తేదీ ధృవ పత్రం, కుల ధృవ పత్రం, పదో తరగతి మార్కుల మెమో, నివాస ధృవ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వికలాంగులు అయితే.. దానికి సంబంధించిన పత్రాన్ని ఆన్ లైన్ లో స్కాన్ చేయాలి.అభ్యర్థులు.. స్థానికులై ఉండాలి.. వాళ్ల వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఒక వేళ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టుల కోసం వివాహితులైన మహిళలు మాత్రమే అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> అయిపాయె.. యాంకర్ ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పేసిన శ్రీముఖి? షాక్ లో అభిమానులు..!
ఇది కూడా చదవండి ==> చేతి వేళ్లను విరిచినప్పుడు టప్పున శబ్దం వస్తుంది ఎందుకో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..?