Ganta Srinivasa Rao : టీడీపీలో ఈ నేత ఉన్నట్టా.. లేనట్టా.. గంటా ఈ మౌనం .. ఎందుకో.. ?

Advertisement
Advertisement

Ganta Srinivasa Rao తెగ‌దు.. సాగ‌దు..అన్నట్లుంది మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు Ganta Srinivasa Rao రాజ‌కీయం.. తాజాగా మళ్లీ తెరపైకి గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. ఆయ‌న ఫుల్లుగా సైలెంట్ అయిపోవ‌డ‌మే.  ఇటీవ‌ల విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం నేప‌థ్యంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేసిన గంటా కొంత హ‌డావుడి సృష్టించారు. ఇక‌, దీనిపై మ‌ళ్లీ నోరు విప్ప‌లేదు. తాను చేసిన రాజీనామాకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్న గంటా శ్రీనివాస‌రావు Ganta Srinivasa Rao .. త‌ర్వాత ప‌రిణామాల‌పై మాత్రం మౌనంగా ఉన్నారు. ప్ర‌స్తుతం గంటా అడ్ర‌స్ ఎక్క‌డ అనే టాక్ విశాఖ‌లో న‌డుస్తోంది. రాజ‌కీయంగా కూడా గంటా శ్రీనివాస‌రావు టీడీపీలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అనే సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. వ‌స్తే.. వైసీపీలో చేర్చుకుంటామ‌ని.. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి ప్ర‌క‌టించారు.

Advertisement

ganta srinivasa rao are you in TDP

విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక.. Ganta Srinivasa Rao

ఆ ప్ర‌క‌ట‌నకు ముందే విజయసాయిరెడ్డి గంటా శ్రీనివాస‌రావును తీవ్రంగా తిట్టిపోశారు. ఆ త‌ర్వాత విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో.. గంటా సైలెంట్ అయ్యారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నార్త్‌లో కూడా వైసీపీ తిరుగులేని విధంగా డివిజ‌న్ల‌లో పాగా వేసింది. పైగా కెకె రాజు దూకుడు ముందు గంటా శ్రీనివాస‌రావు బేజారు అయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో కార్పొరేష‌న్‌లో గెలుపు కోసమే విజయసాయిరెడ్డి అలా ప్రకటించారంటూ వార్తలు వెల్లువెత్తాయి. గంటా శ్రీనివాస‌రావు యాక్టీవ్ అయి, టీడీపీ తరఫున పనిచేస్తే, వైసీపీకి ఇబ్బందులు తప్పవన్న యోచనతోనే విజయసాయిరెడ్డి అలా ప్రకటన చేసి, ఉంటారని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ వాద‌న ఎలా ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవ‌డం కూడా దీనిని బ‌ల‌ప‌రుస్తోంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ మంత్రి.. అవంతి శ్రీనివాస్ దూకుడుగా ఉండ‌డంతో గంటా విష‌యంలో విజయసాయిరెడ్డి కావాలనే వ్యాఖ్యలు చేశారంటూ కేడర్ చర్చించుకుంటోంది.

Advertisement

ycp mp vijayasai reddy

గంటా శ్రీనివాస‌రావు మౌనం .. ఎందుకో.. Ganta Srinivasa Rao

ఇలా అన్ని వైపుల నుంచి రాజ‌కీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నా.. గంటా శ్రీనివాస‌రావు  Ganta Srinivasa Rao ఎక్క‌డా స్పందించ‌కపోవడానికి కారణం.. ఆరోపణలేనని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. గ‌తంలో భూముల‌కు సంబంధించిన కేసుల‌ తోపాటు పూజిత చిట్‌ఫండ్ కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే గంటా శ్రీనివాస‌రావు ఏమీ మాట్లాడలేకపోతున్నారని గంటా వర్గం భావిస్తోంది. టీడీపీలోనే ఉన్నా.. గంటా Ganta Srinivasa Rao యాక్టివ్‌గా లేక‌పోవ‌డం..  వైసీపీలోకి వ‌చ్చేవారిని ఆహ్వానిస్తామ‌న్నా.. రాక‌పోవ‌డం వంటి ప‌రిణామాల వెనుక‌.. ఇదే కారణమని పార్టీలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. అయితే గంటా Ganta Srinivasa Rao కు మునుపున్న ఫాలోయింగ్ .. ఇప్పుడు లేదని పరిశీలకులు కూడా చెబుతున్నారు. అందుకే టీడీపీ కూడా  గంటా వ్యవహారాన్ని పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని అంటున్నారు. వైసీపీ మాత్రం గంటా శ్రీనివాస‌రావును టీడీపీకి దూరం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అంచనా వేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి గంటా .. ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.. దీన్ని కూడా కోల్పోతే టీడీపీ పరిస్థితి అధోగతే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?

Recent Posts

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

5 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

6 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

8 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

9 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

10 hours ago

Vijay : విజయ్ కూడా ఉచితాలపైనే ఆధారపడ్డాడా..?

Vijay  : తమిళనాడు Tamila Nadu Politics  రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…

11 hours ago

Hyundai EV Sector : సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్ తో పనిలేకుండా నడిచే వాహనాన్ని తీసుకరాబోతున్న హ్యుందాయ్..!

Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…

12 hours ago

Indiramma Atmiya Bharosa: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక వారందరీ అకౌంట్లోకి ఏడాదికి రూ.12,000 భరోసా..

Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…

13 hours ago