కేసీఆర్ లో ఇంత మార్పేంటి..? ఈటెల కు భయపడ్డడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కేసీఆర్ లో ఇంత మార్పేంటి..? ఈటెల కు భయపడ్డడా..?

 Authored By brahma | The Telugu News | Updated on :4 July 2021,12:00 pm

కేసీఆర్ పేరు ఎత్తితే ప్రతిపక్షాలు చేసే మొదటి విమర్శా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని, అయితే దానిని చెరిపేసే విధంగా కేసీఆర్ వరస పర్యటనలు చేస్తున్నాడు. దీనికి కారణం ఈటెల రాజేందర్ అనే చెప్పాలి.. దాదాపు 20 ఏళ్ళు తనకు కుడిభుజంగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ను పార్టీ నుండి బయటకు పంపించి కేసీఆర్ తప్పు చేశాడా..? ఒప్పు చేశాడా..? అనే విషయాన్నీ పక్కన పెడితే, ఒక రకంగా ఈటెలను తనకు తానుగా పోటీకి తెచ్చుకున్నాడు కేసీఆర్.

eatala vs kcr huzurabad fight between eatala kcr started

దీనితో ఈటెల రాజేందర్ ను ఎదుర్కోవటానికి తగిన కసరత్తులు చేస్తున్నాడు. పార్టీలో ఉద్యమ నేతలకు, సీనియర్ నేతలకు తగిన గౌరవం ఇవ్వటం లేదంటూ ఈటెల ఆరోపణలు చేస్తున్నట్లు నేపథ్యంలో దానిని తుడిచేయటానికి కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మాజీ స్పీకర్ మధుసూధనాచారి, కడియం శ్రీహరి మొదలు హరీష్ రావు వరకు గతంలో ఫైర్ గన్స్ గా ఉద్యమ సమయంలో వెలుగు వెలిగిన గులాబీ దళంలో ఉన్న వారందరిని ఒక్కసారిగా అక్కున చేర్చుకున్నారు కేసీఆర్. వారినే అస్త్రాలుగా మలచి తన ప్రత్యర్థి శిబిరంపై ఎక్కుపెట్టారు.

ఇదే సయమంలో గ్రామా సర్పంచులతో స్వయంగా కేసీఆర్ మాట్లాడటం, వాళ్లతో కలిసి సహపంక్తి భోజనాలు చేయటం లాంటిది చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మరోపక్క కేటీఆర్ ఏమో అభివృద్ధి మంత్రం జపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నాడు.. ఇటు కేసీఆర్, అటు కేటీఆర్ రెండు వైపులా నుండి వ్యూహాలు అమలుచేస్తూ ఈటెలను టార్గెట్ చేస్తూ హుజురాబాద్ లో కారును పరిగెత్తించాలని చూస్తున్నారు..

telangana minister ktr tests corona positive

మరోపక్క ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ వ్యూహాలను ముందే పసిగట్టి దానికి విరుగుడు రాజకీయాలు చేస్తున్నాడు. తనకు గట్టి పట్టున్న హుజురాబాద్ లో గెలిచి కారు జోరుకు బ్రేక్ లు వేయాలని చూస్తున్నాడు.. మారి ఈ హోరాహోరీ సమరంలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చెప్పటం కష్టమే.. విజయం అనేది పక్కన పెడితే సీఎం కేసీఆర్ వ్యవహరి శైలి మాత్రం మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాటలు. మారి ఈ మార్పు ఎంత కాలం ఉంటుందో చూడాలి..

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది