Pawan Kalyan : చంద్రబాబును కోరుతున్న పవన్ కళ్యాణ్… దూరం జరుగుతున్న బీజేపీ?
Pawan Kalyan : ఏపీ లో వైకాపా ను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ మరియు పవన్ కళ్యాణ్ పార్టీలు పని చేస్తున్నాయి అనిపిస్తుంది. ఇప్పటికే రెండు పార్టీ లు కలిసేందుకు ఏదో ఒక విధంగా వ్యాఖ్యలు చేసుకుంటూ దగ్గర అవుతున్నారు. ఒకే సారి కలియకుండా మెల్ల మెల్ల గా జనాల కోసం కలుస్తాం అనే కలరింగ్ ఇవ్వడం కోసం ప్రతి రోజు ఏదో ఒక మీటింగ్ లో వారు లేదా వీరు పొత్తుల గురించి మాట్లాడి ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ తో జనసేన పొత్తు ఉంది. ఈ పొత్తు చాలా కాలం గా కొనసాగుతూ ఉంది. ఇక బీజేపీ తో పొత్తు లో ఉన్న జనసేనాని పదే పదే తెలుగు దేశం పార్టీకి పొత్తు కు లైన్ క్లీయర్ అన్నట్లుగా సిగ్నల్ ఇస్తున్నాడు. ఆ సిగ్నల్ ను అందుకుంటూ తెలుగు దేశం పార్టీ కూడా పొత్తుకు ఆసక్తిగా ఉన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో జనసేన మరియు తెలుగు దేశం పార్టీ మద్య పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం పొత్తకు ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు ఆసక్తిగా లేదని తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరియు కింది స్థాయి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు పై నమ్మకంతో లేరు. వారు జగన్ ను నమ్ముతున్నారు. జగన్ ఈ మూడు సంవత్సరాల కాలంలో మంచి అభివృద్ది పనులు చేశాడు. కనుక ఆయనకే మనం మద్దతు ఇద్దాం అన్నట్లుగా బీజేపీ నాయకులు అభిప్రాయం తో ఉన్నారు. ఇదే సమయంలో పవన్ తో వారు తెగ తెంపులు చేసుకునేందుకు కూడా సిద్దం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ తో పొత్తు కావాలంటే బీజేపీ తో జనసేన పార్టీ తెగ తెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.